ఒకే వేదికపై రేవంత్- నాగ్- అల్లు అరవింద్..

nag-14-.jpg

హైదరాబాద్‌లో జరుగుతున్న 72వ మిస్ వరల్డ్ 2025 ప్రతినిధులు, కంటెస్టెంట్లకు రాష్ట్ర ప్రభుత్వం విందును ఏర్పాటు చేసింది. ఇందులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కుటుంబ సమేతంగా పాల్గొన్నారు. చారిత్రాత్మక చౌమహల్లా ప్యాలెస్‌ ఈ విందుకు వేదిక అయింది. 109 దేశాల నుంచి వచ్చిన కంటెస్టెంట్లు, ప్రతినిధులతో చౌమొహల్లా ప్యాలెస్ మెరిసిపోయింది. ప్రభుత్వం అధికారికంగా ఏర్పాటు చేసిన ఈ విందులో రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, జూపల్లి కృష్ణారావు పాల్గొన్నారు. ప్రజా ప్రతినిధులు, వివిధ దేశాలకు చెందిన రాయబార కార్యాలయాల ప్రతినిధులు, నగర ప్రముఖులు, ప్రభుత్వ ఉన్నతాధికారులు హాజరయ్యారు.

టాలీవుడ్ నుంచి ప్రత్యేక ఆహ్వానితులుగా హీరో అక్కినేని నాగార్జున, ప్రముఖ నిర్మాత, గీతా ఆర్ట్స్ అధినేత అల్లు అరవింద్, సురేష్ ప్రొడక్షన్స్ చీఫ్ దగ్గుబాటి సురేష్ బాబు ఈ విందులో పాల్గొన్నారు. విందు ప్రారంభానికి ముందు మిస్ వరల్డ్ కంటెస్టెంట్లకు చౌమహల్లా ప్యాలెస్ హైదరాబాద్ వారసత్వ సంపద అనే అంశంపై షార్ట్ ఫిల్మ్‌ను ప్రదర్శించారు. ప్యాలెస్‌ను సందర్శించిన కంటెస్టెంట్లు అక్కడ హైదరాబాద్ చరిత్ర, సంస్కృతిపై ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్‌ను తిలకించారు.

Share this post

scroll to top