ఉప్పెన సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న బుచ్చిబాబు చేస్తోన్న రెండో సినిమా పెద్దిపై మరింత హైప్ నెలకొంది. రామ్ చరణ్ కెరీర్ లో 16వ సినిమాగా వస్తున్న ఈ మూవీలో బాలీవుడ్ స్టార్ బ్యూటీ జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తుంది. కొన్ని నెలలుగా ఈ మూవీ షూటింగ్ వేగంగా జరుగుతుంది. ఇటీవలే చరణ్ బర్త్ డే సందర్భంగా విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్స్, టైటిల్ పోస్టర్ సినిమాపై మరింత క్యూరియాసిటిని పెంచేశాయి. శ్రీరామ నవమి సందర్భంగా ఈ సినిమా నుంచి ఫస్ట్ షాట్ ను గ్లింప్స్ రూపంలో రిలీజ్ చేసింది చిత్రయూనిట్. ఈ సినిమా ఒక స్పోర్ట్స్ డ్రామాగా ఉంటుందని అంటున్నారు. ఈ సినిమాలో క్రికెట్, కుస్తీ, కబడ్డీ వంటి వివిధ ఆటలు ఉంటాయని. ఈ సినిమాలో చరణ్ లుక్ చాలా డిఫరెంట్ గా ఉంది. ఇక ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది.
ఇదిలా ఉంటే ఈ సినిమాలో అదిరిపోయే యాక్షన్, ఎమోషనల్ డ్రామా ఉంటుందని అంటున్నారు. అలాగే ఈ సినిమాలో అదిరిపోయే స్పెషల్ సాంగ్ ఉంటుందని తెలుస్తుంది. ఇక ఈ సాంగ్ లో టాలీవుడ్ హాట్ బ్యూటీ పూజ హెగ్డే చరణ్ తో కలిసి స్టెప్పులేయనుందని టాక్ వినిపిస్తుంది. మొన్నటి వరకు యంగ్ బ్యూటీ శ్రీలీల పెద్దిలో స్పెషల్ సాంగ్ చేస్తుందని టాక్ వినిపించింది. ఇక ఇప్పుడు పూజ హెగ్డే పెద్దిలో స్పెషల్ సాంగ్ చేస్తుందని టాక్. గతంలో చరణ్ నటించిన రంగస్థలం సినిమాలో పూజా జిగేలు రాణి అంటూ అదరగొట్టింది. ఇక ఇప్పుడు మరోసారి గ్లోబల్ స్టార్ తో స్టెప్పులేయనుందని అంటున్నారు. త్వరలోనే దీని పై క్లారిటీ రానుంది.