జైలర్‌2లో ఆ 20 నిమిషాలు బీభత్సమే..

rajani-16.jpg

బాలకృష్ణ రజనీకాంత్ నటిస్తున్న జైలర్ 2 చిత్రంలో ఒక కీలకమైన అతిథి పాత్ర పోషిస్తున్న విషయం తెలిసిందే. నెల్సన్ దర్శకత్వంలో తెరకెక్కిన జైలర్ సినిమా ఎంత పెద్ద విజయం సాదించిదో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అలాగే ఇప్పుడు జైలర్ 2 తెరెకెక్కిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. జైలర్ 2లో నటసింహం కీలక పాత్రలో నటిస్తున్నారు. బాలకృష్ణ ఈ చిత్రంలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఒక పవర్ ఫుల్ పోలీసు అధికారి పాత్రలో కనిపించనున్నారని తెలుస్తుంది. ఈ పాత్ర ఆయన నటించిన రౌడీ ఇన్‌స్పెక్టర్, లక్ష్మీ నరసింహ వంటి ఐకానిక్ పోలీసు పాత్రలా ఉంటుందని ముఖ్యంగా ఫ్లాష్‌బ్యాక్ సన్నివేశాలలో రజనీకాంత్‌తో కలిసి మాస్ ఎలివేషన్ సీన్స్‌లో కనిపిస్తారని వార్తలు వినిపిస్తున్నాయి.

అలాగే బాలకృష్ణ పాత్ర 20 నిమిషాల నిడివి గల ఒక పవర్‌ఫుల్ కామియోగా ఉంటుందని, ఇందులో బాలయ్య యూనిఫామ్‌లో రజనీతో కలిసి యాక్షన్ సీక్వెన్స్‌లలో సందడి చేయనున్నారని తెలుస్తోంది. కొందరు ఈ పాత్ర సైకో పోలీసు ఆఫీసర్‌గా ఉంటుందని, బాలయ్య స్టైల్‌లో విభిన్న డైలాగ్ మాడ్యులేషన్స్‌తో ప్రేక్షకులను అలరిస్తారని అంటున్నారు. ఇక ఈ సినిమా షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుందని తెలుస్తుంది. బాలయ్య బాబు ఉండటంతో తెలుగు రాష్ట్రాల్లో రజనీ సినిమాకు రికార్డు స్థాయి ఓపెనింగ్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. బాలకృష్ణ పాత్ర జైలర్ 2లో హైలైట్‌గా ఉంటుందని, రజనీ-బాలయ్య కాంబినేషన్ బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించే అవకాశం ఉందని అభిమానులు ఆశిస్తున్నారు.

Share this post

scroll to top