ఈ ఆహారపు అలవాట్లు కిడ్నీల్లో రాళ్లకు కారణం..

kidney-22.jpg

ఆహారపు అలవాట్లు ఆరోగ్యంపై ప్రభావం చూపిస్తుంటాయి. ఆహార పదార్థాలు పలు అవయవాల క్షీణతకు దారితీస్తుంటాయి. ముఖ్యంగా కిడ్నీలు, వాటిల్లో రాళ్లు చేరడం ఇటీవలి కాలంలో ఈ సమస్యతో చాలా మంది బాధపడుతున్నారు. మన శరీరంలో కిడ్నీలు అతి ముఖ్యమైన అవయవాలు. ఇవి రక్తాన్ని శుభ్రపరిచి శరీరంలోని వ్యర్థ పదార్థాలను తొలగిస్తాయి. అయితే కొన్నిసార్లు మనం చేసే పొరపాట్లు, మన అలవాట్ల వల్ల కిడ్నీల్లో వ్యర్థ పదార్థాలు పేరుకుపోయి. గట్టిపడి రాళ్లుగా మారతాయి. కిడ్నీలో రాళ్లు ఉంటే చాలా ప్రమాదం. మరి ఈ సమస్యను నివారించడానికి నెఫ్రాలజీస్టుల కొన్ని అలవాట్లు మానుకోమంటున్నారు.

తక్కువ నీరు తాగితే మూత్రం మందంగా మారి రాళ్ళు ఏర్పడే ప్రమాదాన్ని పెంచుతుంది. కావున, రోజూ తగిన మోతాదులో నీరు తాగడం చాలా మంచిది అంటున్నారు. కాల్షియం లోపం వల్ల మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడే ప్రమాదం ఉంది. అధిక మొత్తంలో సోడియం తీసుకోవడం వల్ల మూత్ర పిండాల్లో రాళ్లు ఏర్పడతాయి. అందువల్ల, మీ ఆహారంలో ఉప్పు పరిమితంగా తీసుకోవాలి అంటున్నారు నిపుణలు. మాంసం, గుడ్లు, చేపలు మొదలైన ఆహారంలో ప్రోటిన్లు అధికంగా ఉంటాయి. అదనపు ప్రోటీన్ శరీరంలో యూరిక్ యాసిడ్ మొత్తాన్ని పెంచుతుంది. ఇది కిడ్నీల్లో రాళ్లకు ప్రధాన కారణం. బచ్చలికూర, బీట్‌రూట్, చాక్లెట్, జీడిపప్పు మొదలైన వాటిలో ఆక్సలేట్ అనే మూలకం ఎక్కువగా ఉంటుంది.

అధిక మొత్తంలో ఆక్సలేట్ తీసుకుంటే మూత్రంలో కాల్షియం ఆక్సలేట్ స్ఫటికాలు ఏర్పడతాయి. ఆ తర్వాత ఇవి కిడ్నీలో రాళ్లను ఏర్పరుస్తాయి. అందువల్ల ఈ కూరగాయలను తక్కువ మొత్తంలో తినాలి. అధిక బరువు కూడా మూత్రపిండాల్లో రాళ్ల ప్రమాదాన్ని పెంచుతుంది. బరువు ఎక్కువగా ఉంటే బాడీలో యూరిక్ యాసిడ్ పరిమాణం పెరుగుతుంది. వంకాయ, టొమాటో వంటి గింజలు కలిగిన కూరగాయలలో అధిక మొత్తంలో ఆక్సలేట్ ఉంటుంది. దీని వల్ల కిడ్నీలో రాళ్లు ఏర్పడే ప్రమాదం ఉంది. అందుకే ఈ కూరగాయాలను కూడా తక్కువ పరిమాణంలో తీసుకోవాలని సూచిస్తున్నారు నిపుణులు.

Share this post

scroll to top