కేటీఆర్ వ్యాఖ్యలకు మంత్రి సీతక్క కౌంటర్..

sitha-akka-24-.jpg

కేటీఆర్ కాంగ్రెస్ పై, సీఎం రేవంత్ పై సంచలన కామెంట్స్ చేసిన విషయం తెలిసిందే. కేటీఆర్ వ్యాఖ్యలకు మంత్రి సీతక్క కౌంటర్ ఇచ్చారు. సచివాలయంలో పంచాయతీ గ్రామీణ అభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క మీడియాతో మాట్లాడుతూ సిస్టర్ స్ట్రోక్ తో కేటీఆర్ కు చిన్న మెదడు చితికిపోయింది అని మండిపడ్డారు. కాళేశ్వరంలో కమీషన్ తీసుకున్నప్పుడు లేని భయం కమీషన్ ముందుకు రావడానికి ఎందుకు అని ప్రశ్నించారు. గ్లోబెల్స్ ప్రచారంలో నిన్ను మించిన వారు లేరు కేటీఆర్ నీకు గ్లోబెల్ అవార్డు ఇవ్వాలని ఎద్దేవ చేశారు.

అబద్దాల పునాదుల పై బిఆర్ఎస్ నడుస్తుంది. గోబెల్స్ ను కేటీఆర్ మించిపోయాడు. కవిత చెప్పిన దెయ్యం కేటీఆరే కావొచ్చు రాహుల్ గాంధీ గురించి మాట్లాడే స్థాయి కేటీఆర్ కు లేదు. కాళేశ్వరం కూలిపోయినప్పుడు అధికారంలో ఉంది బిఆర్ఎస్ కాదా మోడీ ప్రశంసల కోసమే ఈడీ గురించి కేటీఆర్ మాట్లాడుతున్నాడు. రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడుగా ఉన్నప్పుడు ఈ కేసు బుక్ చేసారు. యుద్ధంలో ట్రంప్ నీతిని అమలు చేస్తున్నారు మోడీ. అబద్దాన్ని నిజం చేయడం కోసం కేటీఆర్ ప్రయత్నం చేస్తున్నారు.

Share this post

scroll to top