హైదరాబాద్‌లో జరుగుతున్న మిస్ వరల్డ్ పోటీల నుంచి ఇంగ్లాండ్ యువతి తప్పుకున్నారు. మొదట్లో మిస్ ఇంగ్లాండ్ మిల్లా మాగీ వ్యక్తిగత కారణాల వల్ల పోటీలో పాల్గొనలేదని అనుకున్నారు. తర్వాత ఆమె ఓ టీవీకి ఇంటర్వ్యూ ఇస్తూ అసలు కారణాలు బటయపెట్టింది. మిల్లా మాగీ మనస్తాపంతో హైదరాబాద్ మిస్ వరల్డ్ 2025 అందాల పోటీలో నుంచి వెళ్లిపోయారు. అందాల పోటీలో నన్ను వేశ్యలా చూశారని ఆమె గోడు వెల్లబోసుకున్నారు. ఆమెతో కొందరు అగౌరవంగా ప్రవర్తించారని చెప్పుకొచ్చింది.
మిస్ వరల్డ్ పోటీ నుంచి తప్పుకున్న మిస్ ఇంగ్లాండ్..
