రేషన్ కార్డులపై ప్రభుత్వ ఆలోచన భిన్నంగా ఉన్నట్లు తెలుస్తోంది..

rashion-24.jpg

రేషన్ కార్డులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం మాస్టర్ ప్లాన్‌తో ముందుకు వెళ్తోందని తెలుస్తోంది. నిత్యం రేషన్ కార్డుల అంశం ఎలాగో అలాగ వార్తల్లో వినిపిస్తూనే ఉంటుంది. ఈ క్రమంలో రేషన్ కార్డులపై ప్రభుత్వ ఆలోచన భిన్నంగా ఉన్నట్లు తెలుస్తోంది. కొత్త రేషన్ కార్డుల కోసం చాలా మంది ఎదురు చూస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో కోటికి పైగా కుటుంబాలు ఉంటే అందులో 90 లక్షల రేషన్ కార్డులు ఉన్నాయి. ఇప్పటి వరకు చూస్తే రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అనేక సంక్షేమ పథకాలకు రేషన్ కార్డే ప్రామాణికంగా ఉంది. అయితే ఇలా రేషన్ కార్డు ప్రామాణికంగా తీసుకోవడం వల్ల అర్హత లేని వారు కూడా లబ్ధి పొందుతున్నారని ఆరోపణలు ఉన్నాయి. దీని వల్ల ప్రజాధనం దుర్వినియోగం అవుతోందని పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఈ అంశంపై ఫోకస్ చేసినట్లు తెలుస్తోంది. ఒక సమగ్ర విధానాన్ని రూపొందించాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తున్నట్లు తెలుస్తోంది. రేషన్ కార్డులు సబ్సిడీ కింద రేషన్ సరుకులు తీసుకోవడానికి మాత్రమే పరిమితం చేయాలని ప్లాన్ చేస్తున్నట్లు నివేదికలు పేర్కొంటున్నాయి. రేషన్ కార్డులు సంక్షేమ పథకాలకు గుర్తింపు కార్డులుగా మాత్రమే ఉండాలి తప్ప.. అర్హతను నిర్ధారించే కొలమానంగా ఉండకూడదని రేవంత్ ప్రభుత్వం ఆలోచిస్తోంది. ఈక్రమంలోనే రేషన్ కార్డులను సంక్షేల పథకాల నుంచి డీ-లింక్ చేయడంపై కసరత్తు మొదలైనట్లు తెలుస్తోంది.

Share this post

scroll to top