బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల బృందం. కన్నెపల్లి పంప్ హౌస్‌ని సందర్శించింది. ఆ తర్వాత పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. కాలంతో పాటూ పోటీపడి ప్రపంచంలోనే అతి పెద్ద మల్టీపర్పస్ ప్రాజెక్ట్ కాళేశ్వరంను కేసీఆర్ నిర్మించారు. ఉన్న ఆయకట్టుతో పాటు కొత్త ఆయకట్టును అందుబాటులోకి తెచ్చేందుకే ఈ ప్రాజెక్ట్ నిర్మాణం జరిగింది. తెలంగాణలో కరవు అనే మాటే వినబడకుండా ఉండేందుకు అఖండమైన సంకల్ప బలంతో కేసీఆర్ కాళేశ్వరంని నిర్మించారు అని కేటీఆర్ తెలిపారు. తెలంగాణను భౌగోళికంగా చూస్తే మనకు నీళ్లు కావాలంటే ఎత్తిపోతలే మార్గం, అందుకే ప్రాణహిత, మానేరు, గోదావరి కలిసే ఈ ప్రాంతంలో నీళ్లు తీసుకోవచ్చవని కేసీఆర్, మేడిగడ్డ పాయింట్‌ను ఎంచుకున్నారు. తెలంగాణలో ఇంచు ఇంచుకూ నీళ్లు ఇచ్చే బహుళార్థ ప్రాజెక్ట్ కాళేశ్వరం. సముద్ర మట్టం నుంచి దాదాపు 618 మీటర్ల వరకు నీళ్లను ఎత్తిపోయగల కామధేనువు, కల్పతరువు కాళేశ్వరం. కేసీఆర్ ఆదేశాల మేరకు బీఆర్ఎస్ శాసన సభ్యులు, శాసన మండలి సభ్యులం మొత్తం ప్రాజెక్ట్‌ను క్షేత్రస్థాయిలో పరిశీలించాం అని కేటీఆర్ వివరించారు.
కన్నెపల్లి పంప్ హౌస్ ని సందర్శించిన కేటీఆర్..
