గుట్టు చప్పుడు కాకుండా గంజాయి రవాణా జరుగుతూనే ఉంది..

gajai-27.jpg

మాదక ద్రవ్యాల నివారణకు పోలీసులు ఎన్ని కఠిన చర్యలు తీసుకున్నా కట్టడి చేయలేకపోతున్నారు. గుట్టు చప్పుడు కాకుండా గంజాయి, డ్రగ్స్ అక్రమ రవాణా జరుగుతూనే ఉంది. తెలుగు రాష్ట్రాల్లో రోజూ ఎక్కడో ఓ చోట మాదక ద్రవ్యాలు పట్టుబడుతూనే ఉన్నాయి. ఈరోజు హైదరాబాద్ నగరంలో భారీగా గంజాయి పట్టుబడింది. అస్సాం రాష్ట్రానికి చెందిన జై నుద్దీన్ అనే వ్యక్తి బాలాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని షాజహాన్ నగర్ లో ఉంటూ స్థానికంగా ఉన్న కొందరు యువకులతో పాటు విద్యార్థులకు గంజాయిని విక్రయిస్తున్నాడు. ఈ సమయంలో సెర్చ్‌ ఆపరేషన్ నిర్వహిచిన పోలీసులు జైనుద్దీన్‌ను అరెస్ట్ చేశారు. అస్సాం నుంచి గుర్తుతెలియని వ్యక్తి వద్ద గంజా కొనుక్కొని షాజహాన్ కాలనీలోని వ్యక్తులకు అమ్ముకుంటూ సొమ్ము చేసుకుంటున్నాడు. అయితే విషయం తెలుసుకున్న బాలాపూర్ పోలీసులు నిందితున్ని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. నిందితుడి వద్ద రెండు కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడ్డ గంజాయి విలువ రూ. 50 వేల వరకు ఉంటుందని పోలీసులు అంచనా వేశారు. నిందితుడుపై కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించారు.

Share this post

scroll to top