నాగచైతన్య ఫ్యాన్స్ ఎఫెక్ట్‌తో వేణు స్వామి మరో సారి షాకింగ్ డెసీషన్ తీసుకున్నారు. ఇకపై తాను సెలబ్రిటీల జాతకం జోలికి వెళ్లనంటూ మరో సారి చెప్పారు. గతంలో కూడా ఈ స్వామి ఇదే స్టేట్మెంట్ ఇచ్చినప్పటికీ రీసెంట్‌గా ఆ స్టేట్మెంట్‌ను దాటి నాగచైతన్య శోభిత వైవాహిక బంధం పై జోస్యం చెప్పారు. తీవ్ర విమర్శల పాలయ్యారు. ఇంతకు ముందు నాగచైతన్య సమంత జాతకం చెప్పడం వల్లే దానికి కొనసాగింపుగా చై – శోభిత జాతకం చెప్పానన్నారు. ఇక పై గతంలో తాను ఇచ్చిన మాట మీదే నిలబడతా అంటూ ఓ వీడియోను రిలీజ్ చేశారు. నాగ చైతన్య శోభిత ఎంగేజ్మెంట్ అయిందో లేదో ఆ వెంటనే వారిద్దరి వైవాహిక జీవితాన్ని అంచనా వేస్తూ.. వేణు స్వామి జోస్యం చెప్పడం ఇప్పుడు వివాదాస్పదం అవుతోంది. అదే ఇప్పుడు తెలుగు ఫిల్మ్ జర్నలిస్ట్ అసోసియేషన్, తెలుగు ఫిల్మ్ డిజిటల్ మీడియా అసోసియేషన్ సంఘాలకు కూడా కోపం తెప్పించింది. దీంతో ఈ సంఘం నేతలు వేణు స్వామిపై కేస్ పెట్టేందుకు నిర్ణయం తీసుకున్నారు. మరోసారి సెలబ్రిటీల పర్సనల్ లైఫ్‌ను కించపరచకుండా ఆయనపై యాక్షన్ తీసుకునేందుకు రెడీ అవుతున్నారు.
వేణు స్వామిపై కేసు..
