భూ యజమానులకు అలర్ట్..

psd1-copy-4.jpg

కొత్త రెవెన్యూ చట్టం డ్రాఫ్ట్ బిల్లుపై సోమవారం టూరిజం ప్లాజాలో తెలంగాణ రెవెన్యూ ఎంప్లాయిస్ సర్వీసెస్ అసోసియేషన్ ఏర్పాటు చేసిన డిబేట్‌కి మంత్రి శ్రీనివాస్ వచ్చారు. “చట్టాలు సరిగ్గా చేయకపోతే, వాటి ఫలితాలు ఎలా ఉంటాయో గత ప్రభుత్వం తెచ్చిన 2020 రెవెన్యూ చట్టమే ప్రత్యక్ష ఉదాహరణ. అలా ఇకపై అవ్వకుండా కొంత ఆలస్యమైనా, సరైన చట్టాన్ని రూపొందిస్తున్నాం. దీనిపై అందరి అభిప్రాయాలూ తీసుకుంటాం. డ్రాఫ్టును పబ్లిక్ డొమైన్‌లో పెడతాం. ప్రజలు కోరుకున్నదే చేస్తాం. ఆ దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు వెళ్తుంది” అని ఆయన అన్నారు.

ఈ సందర్భంగా మాజీ సీఎం కేసీఆర్‌పై మంత్రి ఫైర్ అయ్యారు. “గ్రామస్థాయిలో రెవెన్యూ భూ పరిపాలనను చూసే యంత్రాంగం లేకుండా చేశారు. రైతులకు, ప్రజలకు రెవెన్యూ అందుబాటులో లేకుండా పోయింది. అధికారంలోకి వస్తే ధరణి పోర్టల్‌ను బంగాళాఖాతంలో కలుపుతామని నాడు పీసీసీ అధ్యక్షుడి హోదాలో రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు, ఆ హామీ మేరకు కొత్త రెవెన్యూ చట్టాన్ని తెచ్చి, ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకుంటాం” అని మంత్రి అన్నారు.

Share this post

scroll to top