ఎన్‌-కన్వెన్షన్‌ కూల్చివేత..

nag-24.jpg

సీనియర్‌ హీరో నాగార్జునకు హైడ్రా షాకిచ్చింది. మాదాపూర్‌లోని ఎన్‌ కన్వెన్షన్‌ను చెరువును ఆక్రమించి నిర్మించారన్న ఆరోపణలతో అధికారులు కూల్చివేశారు. తుమ్మిడికుంట చెరువు ఎఫ్‌టీఎల్‌, బఫర్‌ జోన్‌లో కన్వెన్షన్‌ను నిర్మించారని హైడ్రాకు ఫిర్యాదులు వచ్చాయి. దీంతో దర్యాప్తు చేసిన అధికారులు శనివారం ఉదయం భారీ బందోబస్తు మధ్య కూల్చివేతలు చేపట్టారు. మొత్తం పది ఎకరాలలో విస్తరించి ఉన్న ఎన్‌ కన్వెన్షన్‌ 1.12 ఎకరాల చెరువు భూమిని ఆక్రమించడంతోపాటు 2 ఎకరాలు ఎఫ్‌టీఎల్‌, బఫర్‌జోన్‌ పరిధిలో ఉన్నది. కాగా, తుమ్మిడికుంట చెరువు ఎఫ్‌టీఎల్‌ ఏరియా 29.24 ఎకరాలు ఉన్నది.

Share this post