ఈ నెల 30నుంచి భారీనుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఉత్తర బంగాళాఖాతంలో ఏర్పడిన ద్రోణి ప్రభావంతో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నట్టు తెలిపింది. దీని ప్రభావంతో రాష్ట్రంలో ఈనెల 30 నుంచి వచ్చే నెల 2వ తేదీ వరకు భారీ నుంచి అతిభారీ వర్షాలతో పాటు అక్కడక్కడ అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం హెచ్చరించింది.. ఈనెల 30 నుంచి అతి నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే జాబితాలో పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలు ఉన్నట్లు తెలిపింది. ఈ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది. భారీ నుంచి అతిభారీ వర్షాలు కుమురంభీం, మంచిర్యాల, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ జిల్లాల్లో పడతాయని వెల్లడించింది.
తెలంగాణలో అతి భారీ వర్షాలు..
