ప్రభాస్ ప్రస్తుతం ఒక్కో సినిమాకు రూ.100 కోట్లకు పైగా పారితోషికం తీసుకుంటున్నాడు. నివేదికల ప్రకారం డార్లింగ్ ఆస్తి రూ.240 కోట్లకు పైగా ఉంటుందట. ఇక ఒక్కో బ్రాండ్ ఎండార్స్‌మెంట్‌కు దాదాపు రూ.2 కోట్లు తీసుకుంటాడని సమాచారం. అంతేకాకుండా ప్రభాస్ వద్ద కార్ కలెక్షన్ చూస్తే దిమ్మతిరిగిపోద్ది. ప్రస్తుతం డార్లింగ్ వద్ద రోల్స్ రాయిస్ ఫాంటమ్ కారు ఉంది. ఈ కారు విలువ రూ.8 కోట్లు. ఇండస్ట్రీలో అక్షయ్ కుమార్, షారుఖ్ ఖాన్, అమితాబ్ బచ్చన్ వద్ద మాత్రమే ఈ కారు ఉందట. అలాగే డార్లింగ్ దగ్గర రూ.2.08 కోట్ల విలువైన జాగ్వార్ XJR కారు సైతం ఉంది.
అలాగే రూ.1 కోటి విలువైన రేంజ్ రోవర్ స్పోర్ట్స్ కారుతోపాటు డార్లింగ్ గ్యారేజీలో లాంబోర్గినీ అవెంటడోర్ రోడ్ స్టర్ కారు ఉంది. దీని విలువ రూ.6 కోట్లు ఉంటుంది. అలాగే రూ.68 లక్షల విలువైన BMW X3 ఉన్నాయి. ప్రస్తుతం రాజాసాబ్ సినిమాతోపాటు డైరెక్టర్ హను రాఘవపూడి డైరెక్షన్ లో ఒక సినిమా సలార్ 2 చిత్రాల్లో నటిస్తున్నాడు డార్లింగ్.