తమిళనాడులోని విల్లుపురంలో జరిగిన ఓ ఈవెంట్ లో హీరో విశాల్ సృహ తప్పి పడిపోవడంపై ఆయన మేనేజర్ హరి కృష్ణన్ క్లారిటీ ఇచ్చారు. విశాల్ అనారోగ్యంతో ఉన్నారని, జ్వరం, అలసటతో ఇబ్బంది పడుతున్నారని దీనికి తోడు మధ్యాహ్నం భోజనం దాటవేయడం, బిజీ షెడ్యూల్ వల్ల ఆహారం తీసుకోకపోవడం వలనే ఆయన అస్వస్థతకు గురైనట్లు తెలిపారు. వెంటనే ఆసుపత్రికి తరలించగా వైద్యులు చికిత్స అందించినట్లు చెప్పారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యంగానే ఉన్నారని సమయానికి ఆహారం తీసుకోవాలని డాక్టర్లు సూచించినట్లు పేర్కొన్నారు. గతంలోనూ విశాల్ అనారోగ్యానికి గురైన సంగతి తెలిసిందే. తన సినిమా మద గజ రాజా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో విశాల్ బలహీనంగా కనిపించాడు. ఆ సమయంలో నిలబడటానికి, మాట్లాడటానికి కూడా విశాల్ ఇబ్బంది పడుతున్నట్లుగా వీడియోలో కనిపించింది. ఇది అభిమానులలో ఆందోళనను రేకెత్తించింది.
అందుకే విశాల్ స్టేజ్ పై స్పృహ తప్పి పడిపోయాడు..
