అందం, అభినయంతో యూత్ ను కట్టిపడేసింది. తెలుగులో పలు చిత్రాల్లో నటించినప్పటికీ ఒక్క హిట్ అందుకోలేదు. కానీ ఆమె క్రేజ్ మాత్రం ఎక్కడ తగ్గట్లేదు. నెట్టింట మోడ్రన్ ఫోజులతో కుర్రాళ్లను కట్టిపడేస్తున్న ఈ బ్యూటీ ఎవరో కాదు హీరోయిన్ కేతిక శర్మ. 2021లో విడుదలైన రొమాంటిక్ సినిమాతో కథానాయికగా పరిచయం అయ్యింది. పూరి తనయుడు ఆకాష్ పూరి నటించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ అయ్యింది. కానీ కేతికకు మాత్రం ఆ తర్వాత ఆఫర్స్ వచ్చాయి.
వైష్ణవ్ తేజ్ సరసన రంగ రంగ వైభవంగా, పవన్ కళ్యాణ్ , సాయి ధరమ్ తేజ్ కాంబోలో వచ్చిన బ్రో సినిమాల్లో నటించింది. అలాగే నాగశౌర్య జోడిగా లక్ష్య చిత్రంలోనూ నటించింది మెప్పించింది. కానీ ఆమె నటించిన అన్ని సినిమాలు నిరాశపరిచాయి. కొన్నాళ్లుగా ఈ బ్యూటీకి టాలీవుడ్ ఇండస్ట్రీలో ఆఫర్స్ రావడం లేదు. కానీ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. నిత్యం లేటేస్ట్ క్రేజీ ఫోటోస్ షేర్ చేస్తూ ఫాలోవర్లను ఆకట్టుకుంటుంది. తాజాగా ఈ అమ్మడు షేర్ చేసిన ఫోటోస్ వైరలవుతున్నాయి.