మొన్నామధ్య కాజల్ అగర్వాల్ గర్భం దాల్చినప్పుడు.. ఆమె శరీరాకృతిపై నెటిజన్లు కామెంట్స్ చేయగా.. కాజల్ లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చిపడేసింది. నా జీవితంలో, నా ఇంట్లో, నా పనిలో, నా శరీరంలో మార్పులు చోటు చేసుకుంటుంటాయి. మీరు బ్రతకండి.. ఇతరులనూ బ్రతకనీయండి, స్వార్ధంతో ఆలోచించే వ్యక్తులకు ఈ మాటలు ఎప్పటికీ అర్ధం కావంటూ కాజల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆమెకు మంచు లక్ష్మీ, సమంత, ప్రగతి తదితర నటీమణులు మద్ధతుగా నిలిచారు. ఇక ముక్కుసూటితనానికి పెట్టింది పేరైన మృణాల్ ఠాకూర్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎవరేమనుకున్నా సరే మనసులో ఉన్న మాటలను చెప్పడానికి వెనుకాడను అన్నట్లుగా ఉంటుంది మృణాల్. సీతారామంతో తెలుగువారిని పలకరించిన ఈ బ్యూటీ హాయ్ నాన్న, ది ఫ్యామిలీ స్టార్, కల్కి 2898 ఏడీ వంటి సినిమాల్లో నటించింది. ప్రస్తుతానికి ఏ కొత్త ప్రాజెక్ట్ గురించి అనౌన్స్ చేయనప్పటికీ.. సోషల్ మీడియాలో నిత్యం యాక్టీవ్‌గా ఉంటుంది.
బాడీ షేమింగ్‌పై నోర్మూయించిన హీరోయిన్లు
