ప్రగ్యా జైస్వాల్ కోరిక మాములుగా లేదుగా..

pragya-28.jpg

అందం, అభినయం ఉన్న అవకాశాలు లేక ఎదురుచూస్తున్న భామల్లో ప్రగ్యా జైస్వాల్ ఒకరు. ఈ చిన్నదాని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ ముద్దుగుమ్మ అఖండ సినిమాతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. హీరోయిన్ గానే కాదు సెకండ్ హీరోయిన్ గానూ ఈ అమ్మడు ఆకట్టుకుంది. తన అందం అభినయంతో మంచి మార్కులు కొట్టేసిన ఈ చిన్నది ఆశించిన స్థాయిలో అవకాశాలు మాత్రం అందుకోలేకపోయింది. ఇక సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో అందాలు ఆరబోస్తూ అభిమానులను ఆకట్టుకుంటుంది ఈ చిన్నది. సోషల్ మీడియాలో  ప్రగ్యా జైస్వాల్ షేర్ చేసే ఫోటోలకు మంచి క్రేజ్ ఉంది.

ఇదిలా ఉంటే తాజాగా ప్రగ్యా జైస్వాల్ చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఓ స్టార్ క్రికెటర్ తో డేటింగ్ చేయాలని ఉంది అంటూ చెప్పుకొచ్చింది ఈ ముద్దుగుమ్మ. ఇంతకూ ఆ క్రికెటర్ ఎవరో తెలుసా యంగ్ క్రికెటర్ శుభమాన్ గిల్. శుభ్‌మాన్‌తో డేటింగ్ చేయాలనుకుంటున్నట్లు ప్రగ్యా జైస్వాల్ చెప్పుకొచ్చింది. గతంలో సచిన్ టెండూల్కర్ కూతురు సారాతో శుభ్‌మన్ డేటింగ్ చేస్తున్నాడని గతంలో వార్తలు వచ్చాయి. ఈ జంట తరచూ మీడియా కంట పడుతూనే ఉన్నారు. ఇక ఇప్పుడు ప్రగ్యా జైస్వాల్ చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి.

Share this post

scroll to top