సచివాలయం వద్ద ఉద్రిక్తత చోటుచేసుకున్నది. ఫీజు రియింబర్స్‌మెంట్ బకాయిలను విడుదల చేయాలంటూ ఏఐఎస్‌ఎఫ్ విద్యార్థులు సెక్రటేరియట్‌ను ముట్టడించారు. పోలీసు వలయాన్ని ఛేదించుకుని రాష్ట్ర పరిపాలనా సౌధంలోకి చొచ్చుకెళ్లేందుకు యత్నించారు. దీంతో వారిని అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన పది నెలల కాలంలో రాష్ట్రంలో విద్యావ్యస్థ నిర్వీర్యమైందని విద్యార్థులు విమర్శించారు. ఫిజు రీయింబర్స్‌మెంట్ నిధులను విడుదల చేయకపోవడంతో చాలా కాలేజీలు మూతపడుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.
పది నెలల్లో విద్యావ్యవస్థ నిర్వీర్యం..
