పెళ్లి తర్వాత ఐశ్వర్య రాయ్‌కి అలాంటి నష్టమా..

iswarya-ray2.jpg

ఐశ్వర్యారాయ్ మాజీ ప్రపంచ సుందరి ఈ అందాల భామ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. నాలుగు పదుల వయస్సు దాటిన ఆమె అందానికి కేరాఫ్. ఆమె తన అందంతోనే కాదు నటనతో కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇరువర్ అనే తమిళ చిత్రం ద్వారా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన ఐశ్వర్యారాయ్ తన అందం, అభినయంతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. తన మొదటి సినిమాతోనే ఎనలేని క్రేజ్ తెచ్చుకుంది. ఇక అక్కడి నుంచి తన నట ప్రస్థానం ప్రారంభమైంది. కెరీర్ ఫిక్ స్టేజ్ లో ఉన్నప్పుడు అందాల భామ ఐశ్వర్యరాయ్ బాలీవుడ్ స్టార్ హీరో అమితాబ్ బచ్చన్ కొడుకు అభిషేక్ బచ్చన్ ను 2007లో ప్రేమించి పెళ్లి చేసుకుంది.

ఇక వీరికి ఓ కూతురు కూడా ఉంది. ఆ చిన్నారే ఆరాధ్య. ఐశ్యర్య తన అందం, అభినయంలో ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది అభిమానులకు చేసుకుంది. ఆమె తన కెరీర్ లో ఎన్నో చిత్రాలలో నటించి మంచి పేరు సొంతం చేసుకుంది. ఈ మాజీ విశ్వసుందరీ పెళ్లి అయినా తరువాత కూడా అడపాదడపా సినిమాలలో నటిస్తూ అందరిని ఆకట్టుకుంటున్నది. ఇటీవలే తన సెకండ్ ఇన్నింగ్స్ ను మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన పొన్నియన్ సెల్వన్ సినిమా ద్వారా రీ ఎంట్రీ ఇచ్చింది.

Share this post

scroll to top