ప్రతి ఏడాది ప్రతిష్టాత్మక కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ వేడుకలు ఘనంగా జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ ఏడాది78వ వార్షిక కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ మే 13 న ప్రారంభం కాగా 24 వరకు జరగనున్నాయి. అయితే ఈ వేడుకకు ఫ్రెంచ్ నటి జూలియట్ బి నోచే ప్రధాన పోటీకి జ్యూరి అధ్యక్షురాలిగా వ్యవహరిస్తున్నారు. అయితే ప్యారిస్‌లో జరుగుతున్న కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో బాలీవుడ్ తారలు ప్రత్యేకమైన డ్రెస్సులు ధరించి రెడ్ కార్పెట్‌పై నడుస్తూ అందరి దృష్టిని ఆకర్శిస్తున్నారు. ఇక ఈ వేడుకల్లో 22వ సారి హాజరైన ఐశ్వర్యరాయ్ రోజుకో ప్రత్యేకమైన డ్రెస్‌లో కనిపించి అందరి చేత ప్రశంసలు అందుకుంటోంది.
మొదటి రోజు హాఫ్ వైట్ శారీలో భారతీయత ఉట్టిపడేలా రాయల్‌లో లుక్ కనిపించడంతో పాటు పాపిట్లో సిందూరం పెట్టుకుని అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇక రెండో రోజు ఐశ్వర్య రాయ్ మోడ్రన్ డ్రెస్‌లో కనిపించింది. తన డ్రెస్‌ను స్పెషల్‌గా డిజైన్ చేయించుకుని అందరి చూపును తనవైపుకు తిప్పుకుంది. భారతీయ సంస్కృతి, సంప్రాదాయాలకు విలువనిచ్చిన ఆమె శరీరం కనిపించకుండా కవర్ చేసుకుంది. అసలు ఆ డ్రెస్‌లో ఉన్న ప్రత్యేకత ఏంటంటే.. ఆ దుస్తులు బనారసీ కేప్‌పై భగవద్గీతలోని ‘కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన’ అనే శ్లోకాన్ని చేతితో సంసృతంలో ఎంబ్రాయిడరీ చేసినట్లు సమాచారం. భగవంతుడు అందించిన అమూల్య సంపద భగవద్గీత అని ప్రపంచానికి చాటి చెప్పడానికి ఐశ్వర్య ఆ డ్రెస్‌ను ధరించినట్లు టాక్. ఇక ఇందుకు సంబంధించిన పోస్టులు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండటంతో అంతా ఆమెపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.