సినిమాలు కార్ రేసింగ్‌లు రెండింటికీ న్యాయం చేయలేకపోతున్నా..

ajith-17.jpg

ఇప్పటి నుంచి రేసింగ్‌ సీజన్‌ ఉన్నప్పుడు సినిమాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నాను. రేసింగ్‌కు ఫిట్‌నెస్‌ ఎంతో అవసరం. చాలా రోజుల తర్వాత కార్ల రేస్‌పై దృష్టిపెట్టినప్పుడు ముందు శారీరకంగా బలంగా మారాలని అర్థమైంది. సినిమాలు, రేసింగులు ఒకే సమయంలో ఉంటే ఆ రెండింటికీ సరైన న్యాయం చేయలేకపోతున్నా. దానివల్ల ఎన్నో ఎత్తుపల్లాలు ఎదుర్కోవాల్సి వస్తోంది. అందుకే ఇప్పటి నుంచి రేసింగ్‌ సీజన్‌ ఉన్నప్పుడు సినిమాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నాను. కార్ రేసింగ్‌ చేస్తున్న సమయంలో ఎన్నో ప్రమాదాలు జరిగాయి. ఇంకా నిజం చెప్పాలంటే నా సినిమాల్లో స్టంట్స్‌ నేనే చేస్తా. దానివల్ల నాకెన్నో సర్జరీలు జరిగాయి. అలా అని యాక్షన్‌ సినిమాలు విడిచి పెట్టలేను కదా అదేవిధంగా ప్రమాదాలు జరిగాయని కార్ రేసింగ్‌కు దూరం అవ్వలేను. నా దృష్టిలో ఈ రెండూ ఒకే లాంటివి’ అని అజిత్ చెప్పుకొచ్చారు.

Share this post

scroll to top