మెగాస్టార్ చిరంజీవికి అక్కినేని నాగార్జున ఇంటి నుంచి ఆహ్వానం అందింది. ఇవాళ హైదరాబాద్ లోని మెగాస్టార్ చిరంజీవికి అక్కినేని నాగార్జున వెళ్లి ఆహ్వానం అందజేశారు. అక్కినేని శత జయంతి ఉత్సవాలకు ముఖ్య అతిథిగా రావాలంటే ఆహ్వానించారు నాగ్. అక్కినేని శత జయంతి వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నామని నాగార్జున ప్రకటించారు. ఈ వేడుకలకు బిగ్ బి అమితాబచ్చన్ హాజరవుతున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే అమితాబచ్చన్ చేతుల మీదుగా చిరంజీవికి అక్కినేని జాతీయ పురస్కారం అందజేస్తామని తెలిపారు నాగార్జున. ఈ నెల 28న అన్నపూర్ణ స్టూడియోలో అక్కినేని శత జయంతి వేడుకలు ఉంటాయి. ఇందులో భాగంగానే ఇవాళ హైదరాబాద్ లోని మెగాస్టార్ చిరంజీవికి అక్కినేని నాగార్జున ఆహ్వానం అందించారు.
ప్రత్యేకంగా చిరంజీవిని ఆహ్వానించిన నాగ్..
