ప్రభుత్వం, పోలీసులు రోడ్డు ప్రమాదాలు జరగకుండా ఎన్నో చర్యలు తీసుకుంటున్నారు. కానీ వాహనదారుల నిర్లక్ష్యం వల్ల ప్రతిరోజు పదుల సంఖ్యలో రోడ్డు ప్రమాదాల్లో అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు. ముఖ్యంగా ఈ ప్రమాదాలు అధికంగా నగర ప్రాంతాల్లో ట్రాఫిక్ సమస్యల వల్ల తలెత్తుతుండగా ఇందులో ముఖ్యంగా రాంగ్ రూట్ వల్లే అత్యధిక సంఖ్యలో రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. దీంతో వాహన దారులపై మరోసారి కఠిన చర్యలు తీసుకోవాలని ట్రాఫిక్ పోలీసులు భావిస్తున్నట్లు తెలుస్తోంది. రోడ్డు ప్రమాదాలను తగ్గించేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటూనే రాంగ్ రూట్లో వచ్చి రోడ్డు ప్రమాదాలకు కారణమవుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోనుంది. ఇందులో భాగంగా రాంగ్ రూట్లో వెళ్లి ప్రమాదానికి కారణమైన వారి డ్రైవింగ్ లైసెన్స్ రద్దు చేయాలని ట్రాఫిక్ పోలీసులు భావిస్తున్నారు. ఇదే విషయమై రవాణా శాఖకు ప్రతిపాదనలు పంపగా త్వరలో హైదరాబాద్ పరిధిలో ఈ కొత్త రూల్‌ను అమలులోకి తీసుకురానున్నట్లు తెలుస్తుంది.
ఇప్పటివరకూ ఒక లెక్క.. ఇప్పట్నుంచి మరో లెక్క..
