ఫోర్బ్స్‌ జాబితా మొదటి స్థానంలో అల్లు అర్జున్‌..

pushappa-27.jpg

డిసెంబర్ 5న రిలీజ్ కానున్న ‘పుష్ప 2’ సినిమాపై భారీ అంచనాలున్నాయి. ప్రీ రిలీజ్ బిజినెస్ ఏకంగా వెయ్యి కోట్లకు పైగా చేయగా బాక్సాఫీస్ దగ్గర వెయ్యి కోట్లు ఈజీగా రాబడుతుందని అంతా ఫిక్స్ అయ్యారు. అయితే ఈ సినిమాకు ‘ఐకాన్ స్టార్’ అల్లు అర్జున్ పారితోషికమే ఇప్పుడు ఓ సెన్సేషన్‌గా మారింది. గతంలో పుష్ప 2 కోసం బన్నీ వంద కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్టుగా వార్తలు వచ్చాయి. తాజాగా ఫోర్బ్స్ లిస్ట్ ప్రకారం దీనికి రెండింతలు ఎక్కువగా ఉంటుందని తెలుస్తోంది.

భారతీయ సినీ పరిశ్రమలో అత్యధిక పారితోషికం తీసుకునే హీరోల జాబితాలో అల్లు అర్జున్‌ మొదటి స్థానంలో నిలిచాడు. తాజాగా ఫోర్బ్స్‌ విడుదల చేసిన టాప్‌ 10 జాబితాలో స్టార్ హీరోలను వెనక్కి నెట్టి అగ్ర స్థానంలో బన్నీ నిలిచాడు. ఫోర్బ్స్‌ మ్యాగజైన్ టాప్‌ 10 జాబితా ప్రకారం అల్లు అర్జున్ పారితోషికం రూ.300 కోట్లు అని పేర్కొంది. అంటే ఇండియాలోనే అత్యధికం అన్నమాట. దీంతో దేశంలోనే అత్యధికంగా పారితోషికం పొందుతున్న నటుడిగా బన్నీ రికార్డు సృష్టించాడు. ఈజాబితాలో రెండో స్థానంలో దళపతి విజయ్ ఉంన్నాడు. విజయ్ తన 69వ సినిమా కోసం రూ.275 కోట్లు తీసుకున్నట్టుగా పేర్కొంది.

Share this post

scroll to top