రోజుకో యాపిల్ తినడం వలన అనేక ఆరోగ్య ప్రయోజనాలు.. తినడానికి కూడా సమయం ఉందని తెలుసా..

apple-16.jpg

రోజూ ఒక యాపిల్ తినండి.. డాక్టర్ దగ్గరకు వెళ్ళాల్సిన అవసరం’ రాదు అనే మాట చిన్నప్పటి నుంచి వినే ఉంటారు. ఈ పెద్దలు చెప్పే మాట చాలా వరకు నిజం. ఎందుకంటే ఆపిల్‌ మంచి పోషకాహారం. ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలను అందిస్తుంది. యాపిల్ విటమిన్ సి దొరికే అద్భుతమైన పదార్ధం. ఈ ఆపిల్‌లో బి-కాంప్లెక్స్, విటమిన్ ఇ , కె కూడా ఉన్నాయి. అంతేకాదు ఆపిల్‌లో ఫైబర్, పొటాషియం, మెగ్నీషియం, బీటా కెరోటిన్ వంటి అనేక పోషకాలు మంచి పరిమాణంలో ఉంటాయి. ఇవి ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి సహాయపడతాయి. ఎవరైనా సరే దినచర్యలో భాగంగా తినే ఆహారంలో యాపిల్‌ను చేర్చుకోవాలనుకుంటే.. అల్పాహారం తిన్న ఒక గంట తర్వాత ఆపిల్ తినడానికి ఉత్తమ సమయం లేదా పగటిపూట తినాలి. వాస్తవానికి, ఖాళీ కడుపుతో ఆపిల్ తినడం వలన కొన్నిసార్లు జీర్ణం అవ్వడం కష్టమవుతుంది. రోజూ యాపిల్ తినడం వల్ల గుండె ఆరోగ్యంగా ఉంటుంది. మలబద్ధకంతో బాధపడేవారికి కూడా యాపిల్ తినడం వల్ల మీ జీర్ణక్రియ మెరుగుపడుతుంది. యాపిల్ లో అనేక పోషకాలున్నాయి. యాపిల్‌లో ఫ్రక్టోజ్ కూడా ఉంది. ఇది శక్తిని అందించడంలో సహాయపడుతుంది. రోజూ ఒక యాపిల్ తినడం వల్ల కొద్ది రోజుల్లోనే దీని ప్రభావం ముఖంపై కనిపిస్తుంది. 

Share this post

scroll to top