సెమీ న్యూడ్‌గా నటించారు..

bolliwood-23.jpg

యానిమల్‌’ఫేం త్రిప్తి డిమ్రీకి ఊహించని ప్రశ్న ఎదురైంది. ఈ ప్రశ్న తనను ఎంతో బాధించింది కూడా అందుకే ఘాటైన సమాధానమిచ్చింది. వివరాల్లోకెళ్తే యానిమల్‌ బ్యాడ్‌ న్యూస్‌ చిత్రాల్లో ఘాటైన సన్నివేశాల్లో సెమీ న్యూడ్‌గా నటించిన త్రిప్తి డిమ్రీని ఎవరైనా పెళ్లి చేసుకుంటారా? అంటూ ఒక నెటిజన్‌ ఎక్స్‌ ఖాతా ద్వారా ప్రశ్నించాడు. దీనిపై త్రిప్తి స్పందిస్తూ మరి నాతో అర్ధనగ్నంగా నటించి, పెదవి ముద్దులతో రెచ్చిపోయిన రణబీర్‌ క్యారెక్టర్‌ ని ఎందుకు దూషించరు? తను మగాడనా? అంటే మగాడు ఎలాగైనా చేయొచ్చు.

పాత్రకోసం ఆడవాళ్లు చేస్తే అది పాపం ఘాటైన సన్నివేశాల్లో నటించినంత మాత్రాన నిజజీవితంలోనూ అలాగే ఉంటామని ఎలా జడ్జ్‌ చేస్తారు? ఏది చూడాలో ఏది చూడకూడదో ఎంచుకునే హక్కు ప్రేక్షకులకు ఉంది. అంతేకానీ ఒకరిని దూషించే హక్కు మాత్రం ఎవరికీ లేదు. మగాళ్లను ఒకలా, ఆడాళ్లను ఆకలా చూడటం మానుకోండి. వెండితెరపై రొమాన్స్‌ చేయడంలో ఆడా, మగా ఇద్దరిదీ సమాన పాత్ర అని తెలుసుకోండి.’ అంటూ విరుచుకుపడింది త్రిప్తి డిమ్రీ.

Share this post

scroll to top