ప్రస్తుత రోజుల్లో చాలా మంది ఏదో ఒక అనారోగ్య సమస్య బారిన పడుతున్నారు. ఇందుకు కారణం జీవన శైలిలో మార్పులే ప్రధాన కారణమని చెప్పుకోవచ్చు. సమయానికి భోజనం తీసుకోకపోవడం, సరైన సమయానికి నిద్రపోకపోవడం, బయట ఫుడ్ తినడం, ప్రాసెస్ చేసిన ఆహారాలు అతిగా తినడం, కూల్ డ్రింక్స్ తాగడం ఇలాంటి తప్పిదాల వల్ల మనిషి అనారోగ్య బారిన పడుతున్నారు.
తర్వాత హాస్పిటల్స్ చుట్టూ తిరుగుతున్నారు. వేలల్లో ఖర్చులు పెట్టి దవాఖానాల్లలో చూపించుకుంటూ మందులు మింగుతున్నారు. అయితే వైద్యులు ఇచ్చిన మందులు కొంతమంది తెలిసో తెలువకో కూల్ వాటర్ లేదా నార్మల్ హాట్ వాటర్‌తో తాగుతుంటారు. మరీ చల్లని నీటితో ట్యాబెట్లు వేసుకుంటే ఏమవుతుంది? ఎందుకు వేసుకోకూడదో తాజాగా నిపుణులు చెప్పిన వివరణ ఇప్పుడు తెలుసుకుందాం..
మందులు సిరప్‌లు, సస్పెన్షన్‌లు, డిస్పర్సిబుల్ టాబ్లెట్‌లు, రెగ్యులర్ టాబ్లెట్‌లు, క్యాప్సూల్స్, పౌడర్‌లు మొదలైన వివిధ రూపాల్లో వస్తాయని మనందరికీ తెలిసిందే. అయితే మందులు సిరప్ లేదా సస్పెన్షన్ రూపంలో తీసుకోవడం ఉత్తమమే. ఎందుకంటే అవి సులభంగా జీర్ణమవుతాయని నిపుణులు చెబుతున్నారు.
మందులు తీసుకోవడానికి అవసరమైన నీటి ఉష్ణోగ్రతల విషయానికి వస్తే మందులు కడుపు పేగులలోని జీవ పొరల ద్వారా శోషిస్తాయి. కాగా డైజేషన్ అనేది ఉత్తమంగా ఉండాలంటే అంతర్గత వాతావరణం కూడా సరిగ్గా ఉండాలని నిపుణులు చెబుతున్నారు. కాగా చల్లటి నీరు మందుల కరిగే సామర్థ్యాన్ని తగ్గిస్తుంది. మనం చల్లిని వాటర్ తాగినాక కడుపులో అవి నార్మల్ కావడానికి మన బాడీ ఎక్కువ శక్తిని ఖర్చు చేస్తుంది.
మనం ఆహారంతో చల్లని నీటిని తీసుకున్నప్పుడు కూడా అదే జరుగుతుంది. కాగా మందులు ఎప్పుడైనా సరే సాధారణ ఉష్ణోగ్రత నీటితో వేసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. అలా వేసుకుంటేనే మందులు తొందరగా ప్రభావవంతంగా మారుతాయని అంటున్నారు. అలాగే వేడి వాటర్‌తో కూడా ట్యాబ్లెట్లు వేసుకోకూడదు. ఔషధాన్ని నాశనం చేస్తాయని నిపుణులు సూచిస్తున్నారు.