అర్జున్ 𝐒/𝐎 వైజయంతి’పై బిగ్ అప్‌డేట్ ఇచ్చిన మేకర్స్..

ntr-12.jpg

నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా యంగ్ డైరెక్టర్ ప్రదీప్ చిలుకూరి దర్శకత్వంలో  తెరకెక్కుతున్న సినిమా ‘అర్జున్ సన్నాఫ్ వైజయంతి. కళ్యాణ్ రామ్ కెరీర్ లో 21వ సినిమాగా వస్తున్న ఈ మూవీని ముప్పా వెంకయ్య చౌదరి సమర్పణలో, అశోక్ క్రియేషన్స్ ,అశోక్ వర్ధన్ ముప్పా మరియు సునీల్ బలుసు నిర్మిస్తున్నారు. లేడీ సూపర్ స్టార్ విజయశాంతి పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించబోతుంది. ఏప్రిల్ 18న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కు రెడీ అయింది. కాగా నేడు అర్జున్ సన్నాఫ్ వైజయంతి ట్రైలర్ లాంఛ్ తో పాటు ప్రీ రిలీజ్ ఈవెంట్ కు భారీ ఎత్తున నిర్వహించనున్నారు. అందుకు హైదరాబాద్ లోని శిల్పకలావేదిక ముస్తాబవుతోంది. ఈ వేడుకకు యంగ్ టైగర్ ఎన్టీఆర్ ముఖ్య ముఖ్య అతిథిగా విచ్చేయనున్నారు.

ఈ నేపథ్యంలో నందమూరి అభిమానులు భారీగా తరలిరానున్నారు. ఎన్టీఆర్ వస్తున్నాడు అంటేనే ఆ క్రేజ్ వేరు. మరి ముఖ్యంగా ఎన్టీఆర్ స్పీచ్ కోసం ఎంతగానో ఎదురుచూస్టారు ఫ్యాన్స్. కొన్నేళ్లుగా అభిమానులను ఎన్టీఆర్ డైరెక్ట్ గా కలిసింది లేదు. దేవర ఈవెంట్ క్యాన్సిల్ అవడంతో ఫ్యాన్స్ బాగా డిజప్పోయింట్ అయ్యారు. గత వారం మ్యాడ్ స్క్వేర్ సక్సెస్ మీట్ కు హాజరయిన ఎన్టీఆర్ ఫ్యాన్స్ ను ఫుల్ ఖుషి చేసాడు. నేడు అన్నకళ్యాణ్ రామ్ నటించిన అర్జున్ సన్నాఫ్ వైజయంతి ప్రీ రిలీజ్ కు రాబోతుండడం అభిమానుల సంతోషానికి అవధులు లేవు. యంగ్ టైగర్ జస్ట్ వారం గ్యాప్ లో బ్యాక్ టు బ్యాక్ తన ఫ్యాన్స్ కు మీట్ అవునున్న నేపథ్యంలో ఫుల్ జోష్ లో ఉన్నారు ఫ్యాన్స్.

Share this post

scroll to top