తెలంగాణలో క్రీడలకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్టు చెప్పుకొచ్చారు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఈ క్రమంలోనే హైదరాబాద్‌లో ఒక స్టేడియంపై ఏర్పాటుపై చర్చలు జరిపినట్టు తెలిపారు. కాగా, అసెంబ్లీ సమావేశాల సందర్భంగా స్పోర్ట్స్ కోటాలో నియామక బిల్లుపై శుక్రవారం చర్చ జరిగింది. ఈ సందర్భంగా రేవంత్ మాట్లాడుతూ.. మా ప్రభుత్వం క్రీడలకు అధిక ప్రాధాన్యం ఇస్తుంది. గతంలో లేని విధంగా రూ.361 కోట్లను స్పోర్ట్స్ కోసం కేటాయించాడం జరిగింది. ఇంటర్ పాసైన భారత క్రికెటర్ సిరాజ్‌కు ఉద్యోగం ఇస్తున్నాం. బాక్సర్ నిఖత్ జరీన్‌కు కూడా గ్రూప్-1 ఉద్యోగం ఇస్తున్నామన్నారు. చదువులోనే కాదు ఆటల్లో రాణించినా మంచి భవిష్యత్తు ఉంటుందని మా ప్రభుత్వం భరోసా కల్పిస్తోందన్నారు. చదువులోనే కాదు.. క్రీడల్లోరాణిస్తే కూడా ఉన్నత ఉద్యోగం వస్తుంది. కుటుంబ గౌరవం పెరుగుతుంది.
హైదరాబాద్‌లో మరో క్రికెట్ స్టేడియం సీఎం రేవంత్..
