టాలీవుడ్ నటి అర్చన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ‘నేను’ అనే మూవీతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ.. తన నటనతో అందరినీ ఆకట్టుకుంది. తర్వాత వరుస సినిమాల్లో నటిస్తూ బిజీ బిజీ అయిపోయింది. ఇక స్టార్ హీరోయిన్ రేంజ్‌కు దూసుకుపోతుంది అని అందరూ అనుకున్నారు. కానీ అనుకున్నంత స్టార్ డమ్ అయితే అందుకోలేదు. తర్వాత గెస్ట్ రోల్స్, సహాయ నటి పాత్రలు చేసేసరికి ఈమె క్రేజ్ మరింత తగ్గిపోయింది. అలా చిన్నా చితకా సినిమాల్లో నటిస్తున్న టైంలో ఈ భామకు బిగ్‌బాస్ సీజన్ 1లో కంటెస్టెంట్‌గా వెళ్లే అవకాశం వచ్చింది. ఇక అక్కడ తన గేమ్‌తో మంచి గుర్తింపు తెచ్చుకున్నది. కానీ, ఆ ఫేమ్ బిగ్‌బాస్ హౌజ్ వరకే పరిమితం అయ్యింది. బయటికి వచ్చాక అంతంత మాత్రమే ఆఫర్లు వచ్చాయి. ఈ క్రమంలో కొన్ని షోలకు జడ్జిగా వ్యవహరించినది. ఇక తన సినీ జీవితానికి బై బై చెప్పి లైఫ్‌లో స్థిరపడాలి అనే భావనతో 2019 లో తన ప్రియుడు జగదీష్ వివాహమాడింది ఈ భామ.
ఆ హీరో వల్లే నా జీవితం, కెరీర్ నాశనం అయ్యింది..
