ఒక్క సినిమా కూడా రిలీజ్ కాకముందే టాలీవుడ్ ఆడియన్స్‌కి తెగ నచ్చేసింది..

bagya-sree-29.jpg

ఒక్క సినిమా కూడా రిలీజ్ కాకముందే టాలీవుడ్ ఆడియన్స్‌కి తెగ నచ్చేసింది హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే. తాజాగా రిలీజైన మిస్టర్ బచ్చన్ టాలీవుడ్ మాస్ మహారాజా రవితేజ లేటెస్ట్ మూవీ మిస్టర్ బచ్చన్. రిలీజ్ కు సిద్ధమవుతున్న విషయం తెలిసిందే. స్టార్ డైరెక్టర్ హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్ రీసెంట్ గా కంప్లీట్ అయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉన్న ఈ చిత్రం. ఇండిపెండెన్స్ కానుకగా ఆగస్టు 15వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ఈ సినిమాతో మరాఠీ బ్యూటీ భాగ్యశ్రీ బొర్సే తెలుగు సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన సాంగ్స్, పోస్టర్లు, గ్లింప్సెస్స్ లో భాగ్యశ్రీ తన లుక్స్ తో ఆకట్టుకుంది. ఆమె అందానికి అంతా ఫిదా అయిపోయారు. ఒక్కో ప్రోమో వస్తుంటే.. అమ్మడి క్రేజ్ ఇంకా పెరిగిపోతోంది. కుర్రాళ్లందరికీ డ్రీమ్ గర్ల్ గా మారిపోతోంది. సోషల్ మీడియాలో విపరీతంగా ఫాలోవర్స్ ను సొంతం చేసుకుంటోంది. రోజురోజుకు భారీగా పెంచుకుంటోంది.

Share this post

scroll to top