జబర్దస్త్ అవినాష్‌తో బిగ్ బాస్ తెలుగు 4 సీజన్ గురించి డిస్కషన్ పెట్టింది కిర్రాక్ సీత. ఇంతలో నయని పావని అక్కడికి వచ్చింది. వారికి ఎదురుగా టేస్టీ తేజ, మెహబూబ్ వాళ్లు ఉన్నారు. వైల్డ్ కార్డ్‌గా వచ్చిన వారమే నయని ఎలిమినేట్ కావడంతో ఎవరు నామినేట్ చేశారనని ఆమెను సీత అడిగింది. పల్లవి ప్రశాంత్ నామినేట్ చేశాడు. నేను ఎక్కడ పని చేయలేదని చెప్పాడు అని సీతతో చెప్పిన నయని పావని నేను రోజంతా పని చేస్తూనే ఉన్నాను కదా అని అదే సీజన్ కంటెస్టెంట్ అయిన తేజతో కాస్తా ఫీల్ అవుతూ అంది. తర్వాత గౌతమ్ కృష్ణ నామినేట్ చేశాడని చెప్పింది నయని. ఇలా మొదట సరదాగా సాగిన డిస్కషన్ ఒక్కసారిగా సీరియస్ అయింది.
పక్కన కూర్చున్న తేజ వచ్చి నేను హండ్రెడ్ పర్సంటే ఇచ్చాను. నాది ఇంతవరకు హండ్రెడ్ పర్సంట్ నీది హండ్రెడ్ పర్సంట్ వేరేలా ఉండొచ్చు అని తేజ సీరియస్‌గా అన్నాడు. డిస్కషన్ ఎటో వెళ్లపోతుంది. సీరియస్ అవుతుందేంటీ అని సీత అప్పటికీ అనుకుంటూనే ఉంది. ఇంతలో నీ ఆట చూసుకో నిన్ను బండబూతులు తిట్టారు. రివ్యూవర్లు అని తేజ అన్నాడు. ఎవరన్నారు అని నయని అడిగింది.
వెళ్లి చూసుకో అని కాస్తా రూడ్‌గానే మాట్లాడాడు తేజ. కాసేపు సైలెంట్‌గా ఉన్న నయని ఒక్కసారిగా ఏడవడం మొదలుపెట్టింది. అవినాష్, సీత, మెహబూబ్ ఏమైందని ఆరా తీశారు. కానీ, అక్కడి నుంచి వెళ్లిపోయింది నయని. తన బెడ్‌మీదకు వెళ్లి ఎక్కి ఎక్కి ఏడ్చింది. మెహబూబ్, యష్మీ వచ్చి ఓదార్చారు. నేను మొదటి వారమే ఎలిమినేట్ అయ్యాననే బాధ సంవత్సరంపాటు పడ్డాను అని నయని చెప్పింది.