గౌతమ్ జర్నీ వీడియోతో మనసులను పిండేశావయ్య..

bigg-boss-13-.jpg

నిన్నటి ఎపిసోడ్ లో ముందుగా గౌతమ్ జర్నీని చూపించారు. హౌస్ లో గడిచిన ప్రయాణాన్ని గుర్తుచేసేలా గార్డెన్ ఏరియాలో అదిరిపోయే సెటప్ చేశాడు. ముందుగా గౌతమ్ గార్డెన్ ఏరియాలోకి వచ్చి తన ఫోటోస్ చూసుకుని భావోద్వేగానికి గురయ్యాడు. ఆ తర్వాత అక్కడే ఆల్బమ్ లో తన బిగ్‏బాస్ మెమొరీస్ అన్నీంటిని ఆరెంజ్ చేశారు. అందులో తన అన్నయ్య ఫోటో చూసి.. నేను ఆర్టిస్టు అవుతా అన్నప్పుడు అన్నయ్యే నాకు సపోర్ట్ చేశాడు అంటూ గుర్తు చేసుకున్నాడు గౌతమ్. జీవితంలో సెకండ్ ఛాన్స్ రేర్ గా వస్తుంది.. కానీ నాకు ఆ ఛాన్స్ బిగ్‏బాస్ ఇచ్చారు అంటూ చెప్పుకొచ్చాడు గౌతమ్.

గౌతమ్ గురించి మాట్లాడుతూ పొగడ్తల వర్షం కురిపించాడు బిగ్‏బాస్. ‘బలవంతుడితో గెలవచ్చు కానీ మొండివాడితో గెలవలేము. మనం నమ్మిన దాని గురించి బలంగా నిలబడి ఏమైనా ఫర్లేదు అని పోరాడే వాళ్లు చాలా తక్కువ మంది ఉంటారు. అందులో మీరు ఒకుర. లక్ష్యాన్ని ఛేదించేందుకు మీకున్న ఏకాగ్రతను చూసి ఇంట్లో బలమైన కంటెస్టెంట్స్ కూడా ఇబ్బంది పడ్డారు. ఇక స్త్రీల పట్ల మీకున్న గౌరవం ఆటలో మీ మాటలో స్పష్టంగా కనిపించింది. ఇంట్లోకి వచ్చినప్పుడు మీరు కేవలం శారీరకంగా బలమైన కంటెస్టెంట్. కానీ ఇక్కడ కండబలం ఒక్కటే సరిపోదని త్వరగానే మీరు తెలుసుకున్నారు. ఎలిమినేషన్ వరకు వెళ్లినప్పుడు మీ మనసు చలించింది. అప్పుడే మీ వ్యూహాన్ని మార్చుకున్నారు. చేయాల్సిన పనిని చేస్తే ప్రకృతి కూడా మనకు సహాయం చేస్తుందనేది మీ విషయంలో జరిగింది. బుద్దిబలం, భుజబలంతో ఒక యోధుడిగా పాదరసంలా కదలుతూ ఏ ఆటంకం లేకుండా మీ ఆట ముందుకు సాగింది. మీ కోరుకున్న ప్రేమ మీకు లభించకపోయినా అది మీ ఆటను ప్రభావితం చేయకుండా చూసుకున్నారు. గొప్ప కలలు కనడానికి ధైర్యం కావాలి. అది నెరవేర్చుకోవడానికి అచంచలమైన కార్యదీక్ష కూడా అంతే అవసరం.

Share this post

scroll to top