చివరి ఛాలెంజ్ ఈ గేమ్ లో తేజ, రోహిణి, నిఖిల్, గౌతమ్ పోటీ పడ్డారు. దాంతో నిఖిల్ ఈ గేమ్ లో విన్నర్ గా నిలిచాడు. రెండు ఎల్లో కార్డ్స్‌ను ఒకటి రెడ్ కి ఇంకొకటి గ్రీన్ టీమ్‌కి ఇచ్చేసింది బ్లూ టీమ్. ప్రేరణ, యష్మీ తాము తప్పుకోము అని చెప్పారు. గౌతమ్ తాము తప్పుకోము అని చెప్పారు. దాంతో గౌతమ్ కు తప్పలేదు. రేసు నుంచి తీసేయడంతో చీఫ్ కంటెండర్ అయ్యే ఛాన్స్ కూడా కోల్పోయాడు గౌతమ్. అలాగే గ్రీన్ టీమ్ నుంచి విష్ణుప్రియ తప్పుకుంది.
మెగా చీఫ్ కంటెండర్లుగా ఎంపికైన వారు హరితేజ, నిఖిల్, అవినాష్, నబీల్, ప్రేరణ, తేజ అని బిగ్ బాస్ అనౌన్స్ చేశాడు. వీరికి తిరుగుతూనే ఉండు గెలిచే వరకూ అనే టాస్క్ ఇచ్చాడు బిగ్ బాస్. షిప్ బ్యాగ్‌ను భుజాలపై మోస్తూ మీ బ్యాగ్‌ను కాపాడుకోవాల్సి ఉంటుంది. ప్రతి రౌండ్ లో ఎవరి బ్యాగ్స్ లో బాల్స్ తక్కువ ఉంటాయో వారు ఈ రేస్ నుంచి తప్పుకుంటారు అని చెప్పాడు బిగ్ బాస్. ఈ టాస్కుకి యష్మీ సంచాలక్. ముందుగా అందరూ బ్యాగులు వేసుకొని ఓ సర్కిల్ లో నిలబడ్డారు. వీరిలో మొదటి రౌండ్ లో హరితేజ అవుట్ అయ్యింది.
ఆతర్వాత నిఖిల్-ప్రేరణ కలిసి తేజను టార్గెట్ చేశారు. తేజ తన బ్యాగ్ ను కాపాడుకోవడానికి చాలా కష్టపడ్డాడు. కిందపడిన కూడా తేజ తన బ్యాగ్ ను కాపాడుకున్నాడు. కానీ అతను ఓడిపోయాడు. తేజ ఓడిపోయినా కూడా అతను ఆడిన విధానం ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఆతర్వాత తేజ ఏడుస్తూ బాధపడటంతో గంగవ్వ ఓదార్చింది. కొంచెం స్టామినా ఉంటే బావుండేది ఇంకాసేపు అయినా ఆడేవాడిని ఎప్పుడూ ఇలానే చివరి వరకూ వచ్చి పోతున్నా అంటూ బాధపడ్డాడు తేజ.