తేజను అటాక్ చేసిన సీరియల్ బ్యాచ్.. 

bigg-boss-12.jpg

ఇక నిఖిల్ బ్రెష్ తీసుకుని తేజను నామినేట్ చేశాడు. ఎవిక్షన్ పాస్ ప్రక్రియ జరుగుతున్నప్పుడు తేజ తెలిసి కూడా తప్పు చేశాడని తన పాయింట్ చెప్పాడు నిఖిల్. దీంతో నిఖిల్ డిఫెండ్ చేసుకుంటూ తెలిసి తప్పు చేయలేదు చేశాకా తప్పు అని రియలైజ్ అయ్యాను దాని వల్ల చీఫ్ కంటెండర్ షిప్ పోయింది. ఫ్యామిలీ వీక్ పోయింది. ఇప్పుడు నామినేషన్ నేను గుడ్డు వేసేటప్పుడు ముగ్గురినీ అడిగా వాళ్లిద్దరూ కావాలన్నారు. నువ్వు వద్దన్నావ్ మరీ అదే పాయింట్ నేనూ యష్మీ గొడవ పడేటప్పుడు నువ్వు చెప్పొచ్చుగా నా గురించి ఈ ఇద్దరికి ఎందుకు అంత గొడవ అని అంటూ తేజ క్వశ్చన్ చేశాడు.

దీంతో నేను చెప్పేలోపే నువ్వు గుడ్డు వేశావు అంటూ నిఖిల్ చెప్పడంతో అదొక్కటే తప్పా యష్మీది తప్పు కదా అంటూ పాయింట్ టూ పాయింట్ అడిగాడు తేజ. దీంతో తనను అడుగు నాకు తెలీదు అన్నాడు నిఖిల్. నువ్వు స్మోకింగ్ జోన్ లో స్మోక్ చేసినందుకు పృథ్వీని నామినేట్ చేశావ్ కదా అంటూ నిఖిల్ అడగడంతో.. అంటే పృథ్వీని నామినేట్ చేశానని ఇప్పుడు నువ్వు చేస్తున్నావా అని అడిగాడు తేజ. ఇక్కడ ముగ్గురు కలిసి ఆడుతున్నారంటూ తేజ అనడంతో మీద మీదకు వచ్చాడు పృథ్వీ. దమ్ముంటే పేర్లు చెప్పు చెప్పు అంటూ తేజ మీద మీదకు వెళ్తూ మరీ రెచ్చగొట్టాడు పృథ్వీ.  దీంతో నిఖిల్ ఆన్సర్ ఇవ్వలేకపోయాడు.

ఆ తర్వాత తేజ అవకాశం రాగానే యష్మీని నామినేట్ చేశాడు తేజ. నేను చేసింది తప్పే కానీ ఆ తర్వాత యష్మీ చేసింది కూడా తప్పే ఆ తర్వాత వీకెండ్ లో అడిగితే నిఖిల్ కాకుండా  నబీల్ కు సపోర్ట్ చేసింది. ఈ ముక్కు అప్పుడే చెప్పి ఉంటే అంత జరిగేది కాదు అంటూ తేజ చెప్తుండగానే కోపంతో ఊగిపోయింది యష్మీ. ఫస్ట్ తాను తప్పుచేయలేదని రోహిణి అసలే ఎఫర్ట్ పెట్టలేదని చెప్పుకొచ్చింది. ఒకరు తప్పు చేశారని నువ్వు చేస్తావా అని తేజ అడగ్గా చేస్తా అంటూ చెప్పింది యష్మీ. తనకు గౌరవం ఇవ్వడం లేదంటూ టాపిక్ మార్చింది యష్మీ. నిఖిల్, నబీల్ గురించి తేజ ఒక్కో పాయింట్ క్వశ్చన్ చేయడంతో విరుచుకుపడింది యష్మీ. నువ్వు ఇప్పుడు నాది తప్పంటే తప్పు అయిపోదు అంటూ అడ్డదిడ్డంగా వాదించింది.

Share this post

scroll to top