నబీల్‏కి తల్లి సలహాలు ఏడ్చేసిన తేజ..

bigg-boss-13.jpg

నిన్నటి ఎపిసోడ్‏లో కంటెస్టెంట్లకు సర్ ప్రైజ్ ఇచ్చాడు బిగ్‌బాస్. ఒక వారం ఇంటి మొత్తానికి అన్‏లిమిటెడ్ ఫుడ్ అందించడానికి నబీల్ ఈ సీజన్ అంతా స్వీట్స్ తినను అంటూ మాటిచ్చాడు. దాని ప్రకారమే తనకు చాలా ఇష్టమైనా సరే స్వీట్స్ తినకుండా నబీల్ ఉంటున్నాడు. తాజాగా నబీల్‏కు కంటిన్యూగా స్వీట్స్ పంపించాడు. ముందుగా హల్వా, ఆ తర్వాత మరో స్వీట్స్ పెట్టాడు. కన్ఫెన్షన్ రూంలో నబీల్ స్వీట్స్ తింటుండగా మెయిన్ డోర్ నుంచి వాళ్ల అమ్మ ఎంట్రీ ఇచ్చారు. తనను చూడగానే కంటెస్టెంట్స్ అందరూ పరిగెత్తి వెళ్లి ఆమె కాళ్లపై పడి ఆశీర్వాదం తీసుకున్నారు. ఇక అదంతా టీవీలో చూసి మురిసిపోయాడు నబీల్. కాసపేటి నబీల్ కూడా వెళ్లి తల్లిని ఆప్యాయంగా హత్తుకున్నాడు. దీంతో ఇద్దరినీ కాసేపు వదిలేసి పక్కకు వెళ్లిపోయారు కంటెస్టెంట్స్. ఏట్లా ఆడుతున్నా నేను అంటూ తల్లిని అడిగాడు నబీల్. ఇండివీడ్యువల్ గా అట్లనే ఆడు. ఎమోషనల్ అసలు కావద్దు అంటూ సలహాలు ఇచ్చారు నబీల్ తల్లి.

కష్టపడి ఆడాలి గెలవాలి అంటే నీ ఆట నువ్వు ఆడాలి ఎవరి గురించి పట్టించుకోవద్దు ఎవరో ఏదో అన్నారని ఏం ఫీల్ కావొద్దు. అందరితో మంచిగానే ఉండు అంటూ ఇండైరెక్ట్ గానే హింట్స్ ఇస్తూ సలహాలు ఇచ్చింది నబీల్ తల్లి. తన బెడ్ దగ్గర ఉన్న షీల్డ్ గురించి చెప్పాడు నబీల్. ఆ తర్వాత నబీల్ తల్లితో కంటెస్టెంట్స్ అందరూ సరదాగా మాట్లాడారు. అవినాష్, రోహిణి, నబీల్, విష్ణుప్రియ నామినేషన్స్ సీన్ రీక్రియేట్ చేసి చూపించారు. అందరూ బాగా ఆడుతున్నారు. ఇలాగే ఆడండి అంటూ సూచించింది నబీల్ తల్లి. వెళ్లే ముందు తన కొడుకు కోసం ఓ ఆట ఆడాలని చెప్పాడు బిగ్‌బాస్. టేబుల్ ముందు మూడు ఎన్విలాప్ ఒక డిస్క్ ఉంది. ఆ డిస్క్ ను మీరు విసరండి. అది ఏ ఎన్విలాప్ దగ్గర ఆగుతుందో అది మీ అబ్బాయికి మీ తరుపున ఇచ్చే గిఫ్ట్ అంటూ బిగ్‌బాస్ అనౌన్స్ చేశాడు. ఆ ఎన్విలాప్ లో అమ్మ చేతి గులాబ్ జామున్ 20 పీస్ అని రాసి ఉంది. ఇంతలో గులాబ్ జామ్ కూడా పంపించేశాడు. ఎమోషనల్ అవ్వకు గెలిచేది ఒక్కరే కదా అది గుర్తుపెట్టుకో అంటూ సలహాలు ఇచ్చి వెళ్లిపోయింది నబీల్ తల్లి.

Share this post

scroll to top