డేంజ‌ర్ జోన్‌లో ఆ ముగ్గురు కంటెస్టెంట్స్‌..

bigg-boss-8-1.jpg

బిగ్‌బాస్ 8 లో గురువారం నాటి ఎపిసోడ్ మొత్తం గొడ‌వ‌ల‌తోనే సాగింది. లేడీ కంటెస్టెంట్స్ ఒక‌రినొక‌రు బూతులు తిట్టుకుంటూ తోసుకున్నారు. హౌజ్‌లో ర‌చ్చ‌ర‌చ్చ చేశారు. బిగ్‌బాస్‌ ఇచ్చిన గుడ్ల టాస్క్‌లో మొద‌ట‌ కాంతార టీమ్ వెనుక‌బ‌డిపోయింది. తాము తీసుకొచ్చిన గుడ్ల‌ను శ‌క్తి టీమ్ దొంగిలిస్తున్న‌ చీఫ్ అభ‌య్ ఏం చేయ‌లేక‌పోయాడు. కిచెన్ విష‌యంలో బిగ్‌బాస్ కొత్త రూల్స్ తీసుకొచ్చాడు. ఒక్కో టీమ్ నుంచి కేవ‌లం ముగ్గురు కంటెస్టెంట్స్ మాత్ర‌మే కిచెన్‌లో వంట చేయాల‌ని, వారు వెళ్లిపోయిన మ‌రో టీమ్ మెంబ‌ర్స్ కిచెన్‌లోకి ఎంట‌ర్ కావాల‌ని అన్నాడు.

బిగ్‌బాస్ పెట్టిన కొత్త రూల్స్‌పై అభ‌య్ ఫైర్ అయ్యాడు. బిగ్‌బాస్‌ను బూతులు తిట్టాడు. దిమాక్ లేదు…సైకోగాళ్లు అంటూ రెచ్చిపోయాడు. స‌రిగ్గా తిండికూడా తిన‌నివ్వ‌డం లేద‌ని కోపంగా మాట్లాడాడు. గుడ్ల టాస్క్‌లో త‌మ టీమ్ సంపాదించిన ఎగ్స్‌కు కాంతార టీమ్ చీఫ్ అభ‌య్ స‌రిగ్గా కాప‌లా కాయ‌లేక‌పోయాడు. శ‌క్తి టీమ్ గుడ్ల‌ను దొంగిలిస్తుంటే చూస్తూ ఉండిపోయాడు. చివ‌ర‌కు ఏం చేయ‌లేక త‌న టీమ్ మెంబ‌ర్స్‌నే త‌ప్పు ప‌ట్టాడు. శ‌క్తి టీమ్ దొంగిలించిన గుడ్ల‌ను తిరిగి తీసుకొచ్చేందుకు ప్ర‌య‌త్నించిన ప్రేర‌ణ‌, య‌ష్మిల‌కు అభ‌య్ స‌పోర్ట్ చేయ‌లేదు. త‌మ చీఫ్‌పై కాంతార టీమ్ అసంతృప్తిని వ్య‌క్తం చేసింది.

Share this post

scroll to top