బిగ్ బాస్ విన్నర్ ఓటింగ్..

bigg-boss-10.jpg

బిగ్ బాస్ సీజన్ 8 తుది సమరం రసవత్తరంగా మారింది. విన్నర్ ఎవరో తేల్చేందుకు ఓటింగ్ లైన్స్ ఓపెన్ అయ్యాయి. శనివారం ఎపిసోడ్‌లో రోహిణి ఆదివారం నాటి ఎపిసోడ్‌లో విష్ణు ప్రియలు ఎలిమినేట్ కావడంతో మిగిలిన ఐదురుగు అవినాష్, గౌతమ్, నిఖిల్, ప్రేరణ, నబీల్‌లు టాప్ 5 ఫైనలిస్ట్‌లుగా నిలిచారు.

ఇక ఈ ఐదుగురిలో విన్నర్‌ని తేల్చేందుకు ఓటింగ్ లైన్స్ ఓపెన్‌కాగా వార్ వన్ సైడ్ కాదు వార్ టూ సైడ్ అన్నట్టుగా మారింది. రేస్‌లో మొత్తం ఐదుగురు ఫైనలిస్ట్‌లు ఉన్నా కూడా ఓటింగ్ మొత్తం ఇద్దరికే షిఫ్ట్ అయ్యింది తొలిరోజు. ఆ ఇద్దరే నిఖిల్, గౌతమ్. తొలిరోజు ఓటింగ్‌లో ఈ ఇద్దరూ నువ్వా నేనా అంటూ పోటీ పడుతున్నారు. పుష్ప 2 కలెక్షన్స్ మాదిరిగా ఓట్ల సునామీ సృష్టిస్తున్నారు. అఫీషియల్ పోల్స్ లెక్కల్ని పక్కన పెడితే అన్ అఫీషియల్ పోల్స్‌లో మాత్రం నిఖిల్-గౌతమ్‌ ఇద్దరూ హోరా హోరీగా ఓటింగ్ సాధిస్తున్నారు. కొన్ని పోల్స్‌లో నిఖిల్ ముందుంటే మరికొన్ని పోల్స్‌లో గౌతమ్ ముందున్నాడు. మొత్తం ఓటింగ్‌లో 80 శాతం ఓట్లు వీళ్లిద్దరికే పడుతుండటంతో మిగిలిన ముగ్గురూ రేస్‌లో నామమాత్రంగానే ఉన్నారు.

Share this post

scroll to top