బిగ్‏బాస్ విన్నర్ అతడేనా..

bigg-boss-14.jpg

బిగ్‏బాస్ ఇన్ఫినిటీ సీజన్ 8 రేపటితో ఎండ్ కార్డ్ పడనుంది. 2024 సెప్టెంబర్ 1న ప్రారంభమైన ఈ షో దాదాపు 105 రోజులపాటు నడిచింది. డిసెంబ్ 15న ఈ షోలో గ్రాండ్ ఫినాలే అట్టహాసంగా నిర్వహించనున్నారు. మొత్తం 22 మందితో ఈ షో స్టార్ట్ కాగా ఇప్పుడు 5గురు మిగిలారు. దీంతో ఇప్పుడు ఈ సీజన్ విన్నర్ ఎవరనే విషయంపై ఉత్కంఠ నెలకొంది. ముందు నుంచి టైటిల్ రేసులో నిఖిల్ దూసుకుపోతున్నాడు. కానీ వైల్డ్ కార్డ్ ఎంట్రీలో వచ్చి హీరోగా మారాడు గౌతమ్. తన ఆట తీరు, ప్రవర్తన అడియన్స్ హృదయాల్లో స్థానం సంపాదించుకున్నాడు. దీంతో గౌతమ్ కు ఊహించని విధంగా ప్రేక్షకుల సపోర్ట్ పెరిగింది. ప్రస్తుతం గౌతమ్, నిఖిల్ మధ్య పోటా పోటీగా నడుస్తుంది. ఇక ఆ తర్వాతి స్థానాల్లో నబీల్, ప్రేరణ, అవినాష్ ఉన్నారు. గత ఆదివారం రాత్రి నుంచి ఓటింగ్ లైన్స్ ఓపెన్ కాగా నిన్నటి అర్దరాత్రితో ముగిశాయి. అయితే సోషల్ మీడియాలో ఓటింగ్ లైన్స్ చూస్తే గౌతమ్, నిఖిల్ ఇద్దరికీ దాదాపు 80 శాతం ఓటింగ్ పడింది. ఆ తర్వాత నబీల్, ప్రేరణ, అవినాష్ కు ఓట్లు పడుతున్నాయి.

మొదటి రెండు రోజుల్లో గౌతమ్, నిఖిల్ మధ్య స్వల్ప ఓటింగ్ తేడా నెలకొంది. ఇద్దరూ టాప్ ప్లేస్ లో దూసుకుపోతున్నారు. ఈ ఇద్దరి మధ్య మొదటి రోజు నుంచి ఐదో రోజు వరకు స్థానాల్లో మార్పులు జరిగాయి. మొదటి రోజు నిఖిల్ టాప్ లో ఉండగా ఆతర్వాతి స్థానంలో గౌతమ్ ఉన్నాడు. ఇక రెండో రోజు గౌతమ్ ఓటింగ్ ఒక్కసారిగా పెరిగింది. అయితే ఆఖరు రోజు మాత్రం టాప్ 2 కంటెస్టెంట్స్ ఓటింగ్ విపరీతంగా పెరిగింది. దీంతో మిగతా ముగ్గురి ఓటింగ్ భారీగా తగ్గింది. కానీ అన్ అఫీషియల్ పోల్స్ మాత్రం విన్నర్ ఎవరనేది వేర్వుగా చూపిస్తున్నాయి. యూట్యూబ్ లో ఒకరు విజేత అంటే సోషల్ మీడియాలో మరొకరు విజేత అని చూపిస్తుంది. దీంతో ఇప్పుడు సీజన్ 8 విన్నర్ ఎవరనేది రేపటి వరకు సస్పెన్సే.

Share this post

scroll to top