బిగ్ బాస్ అనగానే కంటెస్టెంస్ట్ గా హౌస్ లోకి వెళ్లిన ప్రతి ఒక్కరికి వారానికి ఇంత అని రెమ్యూనరేషన్ ఉంటుంది. అలాగే ఎవరైతే షోలో విన్నర్ గా నిలుస్తారో వారికి ప్రైజ్ మనీ కూడా దక్కుతుంది. అయితే ఆ ప్రైజ్ మనీ ఎంత అంటే విన్నర్ కి తెలుగులో అనౌన్స్ చేసే ప్రైజ్ మనీ అక్షరాలా రూ.50 లక్షలు. అయితే హౌస్ లో టాప్ 5లో ఉన్న వారికి ఒక సూట్ కేస్ పంపి ఆఫర్ ఇస్తారు. ఆ సూట్ కేసులో ఉన్న మొత్తాన్ని ఒకవేళ కంటెస్టెంట్ గనుక తీసుకుంటే అతను హౌస్ నుంచి బయటకు వచ్చేస్తాడు. అలాగే ఆ మొత్తాన్ని ప్రైజ్ మనీలో నుంచి తగ్గించేస్తారు. ఎప్పుడూ ఉండేలా కాకుండా ఈసారి ట్విస్టులు, టర్నులు అంటూ చాలానే ఎలివేషన్స్ ఇస్తున్నారు. ఆ ట్విస్టుల్లో ఒకటి ప్రైజ్ మనీ జీరో నుంచి ప్రారంభం అవుతుంది.
బిగ్ బాస్ హౌస్ లో కంటెస్టెంట్స్ వారంలో పడిన కష్టానికి తగిన విధంగా ఆ ప్రైజ్ మనీ అనేది ఉంటుంది. మొదటి వారం హోస్ట్ నాగార్జున హౌస్ లో ఉన్న వాళ్ల కష్టం చూసి రూ.5 లక్షలు అయితే ప్రకటించేశాడు. కానీ, బిగ్ బాస్ మాత్రం ఆ రూ.5 లక్షలను వారి ఖాతాలో వేయలేదు. అంతకన్నా ముందు వారికి ఒక ఏవీ చూపించాడు. ఆ ఏవీలో హౌస్ మేట్స్ చేసిన తప్పులు, వాళ్లు ఇంగ్లీష్ లో ఎన్నిసార్లు మాట్లాడారు అనే విషయాలు స్పష్టంగా ఉన్నాయి. వాటిని వంకగా చూపి రూ.2 లక్షలు కోసేసి కేవలం రూ.3 లక్షలు మాత్రమే తొలివారం సంపాదన కింది ప్రైజ్ మనీ ఖాతాలో వేశారు. ఈ పాయింట్ ప్రకారం చూస్తే ఈసారి బిగ్ బాస్ హౌస్ లో ఉన్న వారికి ప్రైజ్ మనీ కింద వచ్చేదీ ఏమీ లేదు అని అర్థమవుతోంది.
బిగ్ బాస్ హౌస్ అంటే రూల్స్ బ్రేక్ చేయడం సర్వ సాధారణం. రూల్స్ బ్రేక్ చేయకపోతే కంటెస్టెంట్స్ ఎలా అవుతారు? అలా రూల్స్ బ్రేక్ చేసినందుకు డబ్బులు కోసుకుంటూ పోతే.. ఇంక విన్నర్ కి మిగిలేది ఏమీ ఉండదు. అలాగే ఆఖరి వారంలో ఒక సూట్ కేస్ ఇచ్చి. ప్రైజ్ మనీలో కొంత మొత్తాన్ని తిరిగి పంపేశాడు అనుకోండి ఇంకేముంటుంది? షో గెలిచాడు అనే పేరు తప్ప ఏమీ ఉండదు.