బిగ్ బాస్ తెలుగు సీజన్ 8లో తొలి రోజు నుంచి ఆట ఆసక్తిగానే సాగుతోంది. ఎవరికి వాళ్లు తమ పాత్రను హైలెట్ చేసుకోవడానికి బాగానే కష్టపడుతున్నారు. ఆర్జీవీ హీరోయిన్ సోనియా అందరికంటే కాస్త ఎక్కువ కృషి చేస్తోంది. అయితే అసలు రెండో రోజు హౌస్ లో ఏం జరిగింది? అసలు ఎవరెవరి మధ్య గొడవలు జరిగాయి? ఎవరిది తప్పు? ఎవరిది ఒప్పు? ఎవరు డామినేషన్ కోసం ఆరాట పడుతున్నారు.
చీఫ్స్ కి అధికారులు పవర్స్ ఇచ్చారు. హారాలు మెడలో వేసుకుని అధికారాలను చేపట్టారు. వెంటనే నామినేషన్స్ కూడా జరిగాయి. సాధారణంగా బిగ్ బాస్ హౌస్ లో కెప్టెన్ అంటే ఒకడే ఉంటాడు. ఎక్కువ సాతం అలా ఉంటే గొడవలు జరగడానికి తక్కువ ఛాన్స్ ఉంటుంది. ఈసారి ఆ పాయింట్ ని పక్కన పెట్టేసి.. చీఫ్స్ ని తీసుకొచ్చారు. ముగ్గురు చీఫ్స్ అంటే.. కచ్చితంగా హౌస్ లో కావాల్సిన్ని గొడవలు జరుగుతాయి. నిజానికి చీఫ్స్ ఉంటే ఒక నిర్ణయం కోసం వాళ్లల్లో వాళ్లే కొట్టుకు చావాల్సిన పరిస్థితి ఉంటుంది.