కిర్రాక్ సీత అందరినీ ఏడిపించేసింది. తాను ఒక వ్యక్తితో దాదాపు ఐదేళ్ల వరకు రిలేషన్ షిప్ లో ఉన్న తర్వాత అతను సడెన్ గా తనని వదిలేసి వెళ్లిపోయాడు అని చెప్పింది. అప్పుడు తనకు ఒక ట్రూ ఫ్రెండ్ దొరికినట్లు సీత చెప్పుకొచ్చింది. కుమారన్ నేను నిన్ను మిస్ అవుతున్నాను అంటూ ఏడ్చేసింది. ఇంక అలాగే నైనికా కూడా తాను ఒక అబ్యూసివ్ రిలేషన్ లో ఉన్న విషయాన్ని పంచుకుంది. నైనికా- సీత ఇద్దరీ బ్రేకప్ స్టోరీ అయితే.. అభయ్- నిఖిల్ ఇద్దరిది మాత్రం ఫాదర్ సెంటిమెంట్. అభయ్ తనకు వచ్చిన తొలి జీతంతో తన తండ్రికి కొనిచ్చిన వాచ్ ని పంపించారు. ప్రస్తుతం అభయ్ తండ్రి లేడు కాబట్టి అతను ఎంతగానో ఎమోషనల్ అయ్యాడు. ఇంక నిఖిల్ కి తన ఫాదర్ షర్ట్ ని పంపించారు. కొడుకుకి ఫాదర్ ని హగ్ చేసుకునేంత బాండింగ్ ఉండదు కాబట్టి.. తన షర్ట్ అలా దొంగతనం చేశాను అంటూ చెప్తాడు. అయితే నిఖిల్ త్యాగం చేసినట్లు కనిపించింది. అభయ్ తనని ఓదారుస్తూ కనిపించాడు. మొత్తానికి ఈ ఎపిసోడ్ ఆడియన్స్ ని కన్నీళ్లు పెట్టిస్తుంది అని అర్థమవుతోంది.
హౌస్ మొత్తాన్ని ఏడిపించేసిన కిర్రాక్ సీత..
