నాగ మణికంఠ vs సంచాలక్ యష్మీ..

bigg-boss-8.jpg

బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 లో ఆట కాస్త ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది. హౌస్ లో ఉన్న గ్రూపులు చాలవని బిగ్ బాస్ కూడా మూడు గ్రూపులు చేశాడు. ఎప్పుడూ లేనిది తిండి కోసం కూడా కొట్లాటలు పెట్టేశాడు. ఎవరికి ఏం కావాలి అన్న దానిని ఆడి గెలుచుకోవాల్సిందే అని చెప్పాడు. ఉన్న 3 క్లాన్స్ కూడా గెలిస్తేనే వారికి భోజనం అనేది లభిస్తుంది. ఎవరు అయితే ఓడిపోతారో వాళ్లు పస్తులు ఉండాల్సిందే అనే ధోరణి అయితే కనిపిస్తోంది. మూడు గ్రూపులకు సంబంధించి ఆటలు నడుస్తూనే ఉన్నాయి. ఈ ఆటల్లో సంచాలక్ గా ఉన్న చీఫ్ యష్మీ గౌడకు నాగ మణికంఠ మధ్య చిన్న వివాదం జరిగింది. ఆ గొడవలో సంచాలక్ డెసిషన్ ఈజ్ ఫైనల్ అంటూ యష్మీ ఒక పెద్ద డైలాగ్ కూడా చెప్పింది. అసలు ఆ ఘటనలో ఎవరు కరెక్ట్ అనే విషయాన్ని చూద్దాం.

బిగ్ బాస్ లాస్ట్ లో రూమ్ లో మరమరాలు ఉంచాడు. ఆ మరమాలను కవర్లో పోసుకుని రావాలి. అది కూడా 250 గ్రాములు మాత్రమే తీసుకురావాలి. అందుకోసం సీత- మణికంఠ గట్టిగానే ప్రయత్నించారు. అయితే మణికంఠ 290 గ్రాములు మరమరాలు తెచ్చాడు. సీత 375 గ్రాముల వరకు తీసుకొచ్చింది. అందుకోసం యష్మీ ఇద్దరిలో ఎవరికీ పాయింట్ ఇవ్వలేదు. ఆ విషయంలోనే మణికంఠ ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఏ మనిషి అయినా సరిగ్గా 250 గ్రాముల మరమరాలు తీసుకురావడం సాధ్యం కాదు. నేను రోబో కాదు అది ఇంపాజిబుల్ అని అంటాడు.

నా మాటే శాసనం అని ఎలివేషన్స్ ఇచ్చుకుంది. ఇంపాజిబుల్ అని నువ్వే అంటున్నావ్. మరి నేను ఎలా పాయింట్ ఇస్తాను అంటూ క్వశ్చన్ కూడా చేసింది. మణికంఠ అడిగింది ఏంటంటే సరిగ్గా 250 గ్రాములు తీసుకురాలేరు కాబట్టి దగ్గర్లో ఉన్నది కన్సిడర్ చేయి అన్నాడు. అందుకు యష్మీ ససేమిరా అంది. గతంలో కూడా ఇలాంటి టాస్కులు ఉంటే ఎవరైతే చెప్పిన దానికి క్లోజ్ గా వచ్చారో వారికి పాయింట్ ఇస్తారు. కానీ, యష్మీ మాత్రం అలా ఇచ్చేందుకు నిరాకరించింది. ఈ విషయంలో మాత్రం నాగ మణికంఠ మంచి ఎఫర్ట్స్ పెట్టాడు. దాదాపుగా 250 గ్రాములు తెచ్చేందుకు చాలా ప్రయత్నాలు చేశాడు. యష్మీని నిలదీయడం కూడా కరెక్ట్ గానే అనిపించింది.

Share this post