బిగ్‌బాస్ హౌస్‌లో ఎమోషనల్‌గా చాలా వీక్‌గా కనిపించిన మణికంఠకి మొదటి నుండి అండగా నిలిచినా కంటెస్టెంట్ నిఖిల్. విగ్గు ఎపిసోడ్ నుండి మొదలుకొని మణికంఠ ఎప్పుడు ఎమోషనల్‌గా వీకైన నిఖిల్ మొదటగా ఓదార్చి దైర్యం చెప్పేవాడు. అనంతరం హౌస్‌లో ఏర్పడిన గ్రూప్ ఫ్రెండ్షిప్స్‌తో మణికంఠ నిఖిల్‌కి దూరమయ్యాడు. తాజాగా జరిగిన ఎపిసోడ్‌లో నిఖిల్ ఏకంగా మణికంఠపై బూతులు మాట్లాడటం చర్చినీయాంశమైంది. లేటెస్ట్‌గా జరిగిన ఎపిసోడ్‌లో ఫిజికల్ టాస్క్స్ నిర్వహించారు. ఓజీ క్లాన్‌లో నిఖిల్, మణికంఠ ఇద్దరూ చెలరేగి ఆడారు. కానీ చివరి రౌండ్‌లో నిఖిల్ పోటీకి మణికంఠ తట్టుకోలేకపోయాడు. దీంతో పరాజయం పొందాడు. అయితే నిఖిల్ ఓ స్టార్ పాయింట్ సంపాదించాడు. గొప్ప ప్రదర్శన కనిపించిన మణికంఠకి కూడా రాయల్ క్లాన్ స్టార్ ఇచ్చింది. దీంతో నిఖిల్ పాటు ఓజీ క్లాన్ కంటెస్టెంట్స్ కాస్త అసహనం వ్యక్తం చేశారు.
బిగ్‌బాస్ హౌస్‌లో బూతులు..
