టాలీవుడ్ హీరోయిన్ తమన్నా చిక్కుల్లో పడ్డారు. తాజాగా ఈడీ విచారణకు హాజరైయ్యారు తమన్నా. HPZ టోకెన్’ అప్లికేషన్ కు సంబంధించి నటి తమన్నాను విచారించింది ఈడీ. బిట్ కాయిన్ సహా పలు క్రిప్టో కరెన్సీ మైనింగ్ పేరిట ఇన్వెస్టర్లను ఈ యాప్ మోసం చేసినట్లు కేసులు నమోదు అయ్యాయి. ఈ అప్లికేషన్ కు సంబంధించిన ఓ ఈవెంట్ కు హాజరైన తమన్నా తాజాగా ఈడీ విచారణకు హాజరైయ్యారు. గతంలో ప్రముఖ నటి తమన్నాకు మహారాష్ట్ర సైబర్ పోలీసు విభాగం నోటీసులు జారీ చేసింది. ఐపీఎల్ 2023 మ్యాచ్‌లను అక్రమంగా ‘ఫెయిర్ ప్లే’ యాప్‌లో ప్రదర్శించిన కేసులో సమన్లు ఇచ్చినట్లు తెలిపింది. నిబంధనలకు వ్యతిరేకంగా ఐపీఎల్ మ్యాచ్‌లను ఈ యాప్‌లో ప్రసారం చేయడంతో ‘వయాకామ్’ మీడియాకు రూ.కోట్ల మేర నష్టం జరిగిందని సైబర్ విభాగం పేర్కొంది. ఇక ఇప్పుడు తమన్నా ఈడీ విచారణనను ఎదుర్కొన్నారు.
ఈడీ విచారణకు తమన్నా..
