బాడీ షేమింగ్‌పై టాలీవుడ్ హీరోయిన్ ఆవేదన..

ananey-17.jpg

తండ్రి వారసత్వాన్ని కొనసాగిస్తూ ఈ హీరోయిన్ కూడా సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. కానీ తరచూ నెపోటిజం విమర్శలను ఎదుర్కొంది. నెట్టింట ట్రోలింగ్ ను ఎదుర్కంది. అయితే అన్నిటికన్నా మరీ ముఖ్యంగా చిన్న వయసులోనే బాడీ షేమింగ్ బారిన పడిందీ అందాల తార. దీనికి తోడు ఈ బ్యూటీ నటించిన సినిమాలన్నీ వరుసగా ఫ్లాప్ కావడంతో కొందరు ట్రోలర్లకు ఈ హీరోయిన్ టార్గెట్ అయిపోయింది. తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన ఈ హీరోయిన్ కెరీర్ ప్రారంభంలో తాను ఎదుర్కొన్న అవమానాలు, చేదు అనుభవాలను గుర్తుకు చేసుకుంది. ‘నేను 18-19 ఏళ్ల వయసులో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాను.

ఆ సమయంలో నేను చాలా సన్నగా ఉన్నాను. దీంతో చాలా మంది నా బాడీపై కామెంట్స్‌ చేశారు. కోడీ కాళ్లు అగ్గిపుల్లలా ఉన్నావంటూ నా శరీరంపై విమర్శలు చేసేవారు. నీ శరీరాకృతి సరిగ్గా లేదంటూ అసభ్యకరమైన కామెంట్స్‌ కూడా చేశారు. కానీ ఇప్పుడు నా శరీరం సహజంగానే మారుతుంటే ‘ప్లాస్టిక్‌ సర్జరీ చేయించుకుంది’ అంటున్నారు. దీనిని బట్టే ఒక విషయం అర్థమైంది. మనం ఏ విధంగా ఉన్నా ఈ విమర్శలు, ట్రోలింగ్ లు తప్పవు. వాటిని పట్టించుకోకుండా మన పని మనం చేసూకుంటూ పోతేనే విజయం సాధించగలం’ అని తనలాంటి వారిలో స్ఫూర్తి నింపిందీ ముద్దుగుమ్మ. ఇలా కెరీర్ ప్రారంభంలోనే బాడీ షేమింగ్ బారిన పడ్డ ఆ ముద్దుగుమ్మ మరెవరో కాదు లైగర్ బ్యూటీ అనన్య పాండే.

నటుడు చంకీ పాండే కుమార్తె కావడంతో అనన్యకు సినిమా అవకాశాలు సులభంగా వచ్చాయి. ‘స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ సీజన్ 2’ ద్వారా అనన్య పాండే సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. ఈ సినిమా పెద్దగా ఆడలేదు. దీంతో ఇంకో సినిమాతో సక్సెస్ కొట్టేద్దామనుకుంది అననన్య. కానీ ‘పతి పత్నీ ఔర్ వో’, ‘ఖాలీ పీలీ’, ‘గెహ్రాయన్’ ఖో గయే హమ్ కహాన్, బాడ్ న్యూజ్, ఖేల్ ఖేల్ మే.. ఇలా అనన్య నటించిన సినిమాలు యావరేజ్ రిజల్ట్ తోనే సరిపెట్టుకున్నాయి. అయితే ఇటీవల అక్షయ్ కుమార్ తో కలిసి ఆమె నటించిన కేసరి చాప్టర్ 2 సినిమా బ్లాక్ బస్టర్ గా నిలిచింది. మొదటి సారిగా అనన్య నటనకు విమర్శకుల ప్రశంసలు దక్కుతున్నాయి. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ చేతిలో పలు క్రేజీ ప్రాజెక్టులున్నాయి.

Share this post

scroll to top