పుష్ప పార్ట్ 1 సక్సెస్ లో సమంత స్పెషల్ సాంగ్ కు కూడా భాగముంది. ఊ అంటావా మావా అంటూ ఆమె వేసిన హుషారైన స్టెప్పులు ఇప్పటికీ ఎక్కడో ఓ చోట కనిపిస్తూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో పుష్ప పార్ట్ 2లోనూ స్పెషల్ సాంగ్ విషయంలో అంతకు మించి ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు మేకర్స్. ఈ క్రమంలోనే బాలీవుడ్ బ్యూటీ శ్రద్దా కపూర్‌ను పుష్ప2 కోసం రంగంలోకి దించేస్తున్నారట. పుష్ప2లో ఐటెం సాంగ్ చేస్తోందంటూ ఆ మధ్యన దిశా పటానీ పేరు వినిపించింది. అలాగే యానిమల్ బ్యూటీ త్రిప్తి డిమ్రి పేరు కూడా బయటికి వచ్చింది.
అయితే ఇవేవీ నిజం కాదన్నట్టు ఇప్పుడు ఫైనల్ గా స్త్రీ2 హీరోయిన్ శ్రద్ధా కపూర్ పుష్ప2లో స్పెషల్ సాంగ్ చేస్తుందని టాక్. ఇక పుష్ప 2 సినిమాలో అల్లు అర్జున్ సరసన రష్మిక మందన్నా హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పుడు స్పెషల్ సాంగ్ కోసం నార్త్ హీరోయిన్ ను పెడితే బాలీవుడ్ లో మూవీకి మంచి క్రేజ్ వస్తుందని భావిస్తున్నారట మేకర్స్ అందులో భాగంగానే ప్రస్తుతం ట్రెండింగ్ లో ఉన్న శ్రద్ధాకపూర్ ను ఈ పాట కోసం సెలెక్ట్ చేసినట్లు టాక్ వినిపిస్తోంది.