తెలంగాణలో పార్టీ ఫిరాయింపుల వేళ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్‌కు బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బహిరంగ లేఖ రాశారు. ఈ లేఖలో రేవంత్ సర్కార్ శాసనసభ్యుల హక్కులను ఉద్దేశపూర్వకంగా కాలరాస్తోందని ఆరోపించారు. కాగా, కేటీఆర్ లేఖలో కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కేటీఆర్ లేఖ ప్రకారం.. రాష్ట్రంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేల హక్కులను కాలరాస్తూ ప్రోటోకాల్ ఉల్లంఘనలు జరుగుతున్నాయి. అహంకారపూరితంగా ప్రజాస్వామ్య స్ఫూర్తిని కాంగ్రెస్ ప్రభుత్వం దెబ్బతిస్తోంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కాదని కాంగ్రెస్ నేతలకు సంక్షేమ పథకాల పంపిణీ బాధ్యతలు అప్పగిస్తున్నారు. శాసససభ్యుల హక్కులను ఉద్దేశపూర్వకంగా రేవంత్ సర్కార్ కాలరాస్తోంది. ఎమ్మెల్యేల హక్కులు, ప్రోటాకాల్ ఉల్లంఘనలు జరగకుండా అడ్డుకోవాలి. ఈ మేరకు సీఎస్, జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ఇక, అవసరమైతే ఈ అంశాన్ని అసెంబ్లీ సమావేశాల్లో కూడా లేవనెత్తుతామని తెలిపారు.
స్పీకర్ గడ్డం ప్రసాద్‌కు కేటీఆర్ లేఖ విషయమేంటంటే..
