దమ్ముంటే నల్గొండ క్లాక్ టవర్ దగ్గరకు రా..

ktr-28-1.jpg

కాంగ్రెస్ సర్కార్ చెబుతున్న రుణమాఫీ, రైతుభరోసా, బోనస్ అన్నీ బోగస్ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. ఈ రోజు నల్లగొండలో నిర్వహించిన రైతు ధర్నాలో ఆయన పాల్గొన్నారు. నల్లగొండ పోరాటాల గడ్డ అని అన్నారు. పోరాటానికి స్పూర్తిని ఇచ్చిన ఈ ప్రాంతానికి వందనమన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతుల కష్టాలు మొదలయ్యాయ్నారు. పోరాటాల పురిటి గడ్డ నల్లగొండ మళ్లీ రాష్ట్రంలో రైతుల తిరుగుబాటుకు వేదిక కావాలన్నారు. కేసీఆర్ పాలనలో టింగ్‌ టింగ్‌ మని డబ్బులు ఖాతాలో పడేవని గుర్తు చేశారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి రైతులను నిలువునా మోసం చేస్తున్నారని ఆరోపణలు చేశారు. కేసీఆర్‌ 2 పంటలకే ఇస్తుండు.. కానీ రేవంత్‌రెడ్డి మూడో పంటకు ఇస్తా అని మోసం చేశాడన్నారు. జనవరి 26న రా.12 గంటలకు డబ్బులు వేస్తామని రేవంత్ అన్నారు కానీ ఇప్పటివరకు రూపాయి పడలేదన్నారు. నల్లగొండ బిడ్డలు జీవచ్ఛవాలుగా మారడానికి కాంగ్రెస్సే కారణమన్నారు.

కాంగ్రెస్ ప్రభుత్వం 2023 యాసంగి పంటకు 2,500 బాకీ పెట్టిందని, వానాకాలం ఒక్కో ఎకరానికి 7,500 బాకీ ఉందన్నారు. ఒక్కో రైతుకు ఎకరాకు రూ.17,500 చొప్పున కాంగ్రెస్ బాకీ ఉందన్నార. కాంగ్రెస్ రైతులను నిలువునా మోసం చేసిందని ఆరోపించారు. రైతుబంధు డబ్బులు ఆపడానికి రేవంత్ రెడ్డి కుట్రలు పన్నుతున్నాడని ఫైర్ అయ్యారు కేటీఆర్. మార్చి 31 వరకూ రుణమాఫీ కొనసాగుతుందని చెబుతున్నారు కానీ ఏ సంవత్సరమో చెప్పడం లేదని ఎద్దేవా చేశారు. నల్లగొండ నుంచి కాంగ్రెస్ వ్యతిరేక పోరాటం ప్రారంభమన్నారు. కాంగ్రెసోళ్లు మళ్లీ ఓట్ల కోసం వస్తారని.. అప్పుడు వారిని నిలదీయాని ప్రజలకు పిలుపునిచ్చారు. 

Share this post

scroll to top